షార్ట్ బ్రేక్ తీసుకుందాం.. మళ్లీ కలుద్దాం… కేటిఆర్ ట్వీట్ పొలిటికల్ హాట్ టాపిక్…!

షార్ట్ బ్రేక్ తీసుకుందాం.. మళ్లీ కలుద్దామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. చిన్న విరామం తీసుకుని రిఫ్రెష్ అయ్యి వస్తానంటున్నారు కేటీఆర్. తాను పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేను కదా అని తనరాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్సవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఓ స్మయిలింగ్ ఎమోజీని కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతుండగా..అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో దీనిపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది…

కేటీఆర్ సడెన్‌గా బ్రేక్ తీసుకోవడం వెనుక వ్యక్తిగత వ్యవహారమేనా లేక మరేదైనా పొలిటికల్ రీజన్ ఉందా అనేది డిస్కషన్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతాయనే టాక్ కొంతకాలంగా జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత ఈ మధ్యే పొలిటికల్‌గా యాక్టివ్ కాగానే కేటీఆర్ విరామం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రాబోయే రోజుల్లో కవిత సెంట్రిక్ గా గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.

అందుకే కేటీఆర్ షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నారని..ఆయన తిరిగి వచ్చేవరకు కవిత, హరీశ్‌రావు ఇద్దరు పార్టీ యాక్టివిటీని నడిపిస్తారని అంటున్నారు. అప్పటివరకు కవిత కూడా లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తారని..కేటీఆర్ రిలీఫ్ అయి వచ్చాక కేటీఆర్, కవిత, హరీశ్ రావు ముగ్గురు మరింత పార్టీ కార్యక్రమాలు, అధికార పార్టీపై పోరులో దూకుడు పెంచుతారని అంటున్నారు కొందరు బీఆర్ఎస్ లీడర్లు. అయితే ఆయన షార్ట్ వెకేషన్ కోసం కేరళ వెళ్లారని…రెండు మూడు రోజుల్లోనే మళ్లీ రంగంలోకి దిగుతారంటున్నారు కేటీఆర్ సన్నిహితులు

కేటీఆర్ ఒక్క ట్వీట్ ఇలా వంద ప్రశ్నలు..ఎన్నో ఊహాగానాలకు తావు ఇస్తోంది. ఆయన రిఫ్రెష్ కావడానికే బ్రేక్ తీసుకుంటున్నా..సమ్‌థింగ్ ఈజ్ దేర్ అని చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. చూడాలి మరి కేటీఆర్ బ్రేక్ ఎన్నిరోజులు తీసుకుంటారు.. ఆ తర్వాత బీఆర్ఎస్ యాక్టివటీ ఎలా ఉండబోతుందనేది..