బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి నెల గ్రామాలకు 275 కోట్లు, పట్టణాలకు 150 కోట్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె, పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీలకు ఇవ్వడం లేదని విమర్శించారు… ఇది మన రాష్ట్రానికే కాదు, మన దేశానికే అవమానం. మీ పాలన ఈ విధంగా ఉన్నది. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దిగిపోయి తొమ్మిది నెలలైనా ఇంకా వారికి జీతాలు చెల్లించలేదు. ఒకటో తేదీన జీతాలిస్తున్నమని గొప్పగా చెబుతరు.. కానీ జెడ్పీ చైర్మెన్లకు జెడ్పీటీసీలు, ఎంపీటీలకు ఇంప్పటికీ వారికి మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. వారికి స్పష్టమైన తేదీ చెప్పాలి. పంచాయతీ ఎన్నికలలోపు వారికి జీతాలు చెల్లించాలి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రాజీవ్గాంధీ తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం, గ్రామపంచాయతీలను బలోపేతం చేస్తామన్నరు. క్రమంతప్పకుండా నిధులు విడుదల చేస్తామన్నారు. మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నరు. అవేమీ చేయకుండా కనీసం జీతాలు కూడా ఇస్తాలేరు. వారి జీతాలు, పెండింగ్ నిధులను ఎప్పటిలోగా క్లియర్ చేస్తరో స్పష్టంగా చెప్పాలని’ హరీశ్రావు డిమాండ్ చేశారు. కాగా, సర్పంచుల పెండింగ్ బిలులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.