నేడు అసెంబ్లీలో భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గంట ముందే అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు..ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల అజెండా
గురువారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదట గంట సేపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం భూ భారతి (ఆర్ఓఆర్) 2024 బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లు సభలో ఆమోదం పొందుతుంది. అలాగే ఈ రోజు మరో మూడు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు.., జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. మంత్రి సీతక్క పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఈ రెండు అంశాలపై సభలో లఘు చర్చ జరగనుంది. .