బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs), ఎమ్మెల్సీ (MLCs)లు గురువారం శాసనసభ, మండలి సమావేశాలకు రైతు కండువాలతో (Farmers scarves) రానున్నారు..రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుపట్టనుంది. బీఆర్ఎస్ నేతలు రోజుకో సమస్యతో శాసనసభకు వస్తున్నారు. బుధవారం ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదట రోజు అదానీ, రాహుల్ గాంధీ టీ షర్ట్స్‌తో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా మంగళవారం బేడీలు ధరించి వచ్చారు. ఇలా రోజుకో వేషంతో బీఆర్ఎస్ నేతలు సభకు వస్తున్నారు.