కేటీఆర్ పై కేసు నమోదు.
_• తెలంగాణ ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి KTRపై కేసు నమోదైంది._
*A-1గా KTRతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పైనా ఏసీబీ కేసు నమోదు చేసింది…
మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై కేసు నమోదు అయింది. ఫార్ములా-ఈ కార్ రేసు(Formula-E car race)లో జరిగిన అవకతవలపై ఏసీబీ(ACB) అధికారులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేవారంటూ ఏసీబీ పేర్కొంది. నాలుగు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం..

A1 గా కేటీఆర్
ఫార్ములా ఈ రేస్ లో నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు చేసిన ACB
A1- KTR
A2- IAS Arvind Kumar
A3- HMDA Chief Engineer BLN Reddy..
RBI గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఎఫ్ఈవో కంపెనీకి హెచ్ఎండీఏ రూ.45 కోట్లు చెల్లించింది. క్యాబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే.. నిధులు చెల్లించినట్టు కేటీఆర్‌పై అభియోగాలున్నాయి. కేటీఆర్ ఆదేశాలతోనే ఐఏఎస్ అరవింద్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని.. ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడంపై.. అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి రూ.8కోట్ల ఫైన్ వేసింది RBI. అధికారంలోకి వచ్చాక RBIకి రూ.8 కోట్లు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్న కేటీఆర్‌పై.. కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కేటీఆర్ ఆదేశాలతో ఐఏఎస్ అరవింద్ కుమార్ నిధులు చెల్లించినట్లు తేలింది. HMDA చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపైనా కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి పేరు నమోదు చేసింది ఏసీబీ.
ఈ కార్ రేస్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ-1గా చేర్చారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా చేర్చారు. బీఎల్ఎన్ రెడ్డిని ఏ-3గా చేర్చారు. కేటీఆర్ ను ఏ-1గా చేర్చడంతో.. ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారిస్తారా? లేక అరెస్ట్ చేస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది..