మీ వాట్సప్కు వచ్చే APK ఫైల్ లింక్ క్లిక్ చేస్తే మి అకౌంట్ లో డబ్బులు పోయినట్లే..!

సోషల్ మీడియా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఫోన్లపై ఆధారపడుతున్నారు. జేబులో డబ్బు లేకున్నా కూడా స్మార్ట్‌ఫోన్ మాత్రం కచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సైబర్ మోసగాళ్లు వీటిని టార్గెట్ చేశారు..

ఫోను మాత్రమే మీది.. ఆపరేట్ చేసేది మొత్తం కూడా హ్యాకర్లే….. వాట్సప్ లో వచ్చే లింకు ని క్లిక్ చేస్తే ఇంకా అంతే సంగతులు… ఇటీవల ఈ మోసాలు అధికమైపోయాయి..

వాట్సాప్ గ్రూప్లో నీ ఫోను ఉంటుంది కానీ మీ నెంబర్ కాదు..!
మిగతా గ్రూపులోకి రిక్వెస్ట్ పెడతారు డిపి అన్నీ కూడా మీవే ఉంటాయి.. కానీ రిక్వెస్ట్ పెట్టేది మీరు కాదు..!
ఇలా ఉన్నాయి సైబర్ మోసాలు..

Apk అని ఉండే..ఏ ఫైల్స్ కూడా ఓపెన్ చేయకూడదు..

Aadhar.Apk

SBI.Apk

pm kisan.Apk

Unions Bank.Apk

అలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ కి గురవుతుంది..

మీ ఫోన్లో ఉన్న డాటా మరియు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడ పోయినట్లే….

ఫోన్‌లోకి వైరస్ ఎలా ప్రవేశిస్తుంది?
వైరస్‌లు సాధారణంగా ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ లింక్స్, డూప్లికేట్ వెబ్‌సైట్స్ లేదా సెక్యూర్ లేని వెబ్‌సైట్స్, ఫేక్ ఫైల్స్, సెక్యూర్ లేని వైఫై తదితర వాటిని యాక్సెస్ చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్లలోకి ప్రవేశిస్తాయి.

కొత్త స్మార్ట్‌ఫోన్ సడెన్‌గా స్లో అయితే లేదా త్వరగా బ్యాటరీ అయిపోతే, మీరు డౌన్‌లోడ్ చేయని, మీకు తెలియని యాప్స్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్‌కి అప్‌డేట్ చేయాలి. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దు. మీ ఫోన్లో అప్రూవ్ చేయని థర్డ్ పార్టీ యాప్స్ లేదా APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయకండి…

బ్యాంక్ బ్యాలెన్స్ నిల్…!

మీ బ్యాంక్ ఖాతా ఈరోజు తొమ్మిదిన్నర గంటలకు బ్లాక్ అవుతుంది. దయచేసి మీ పాన్కార్డును అప్డేట్ చేసుకోండి. దీని కోసం మీకు వచ్చిన మెసేజ్లోని బ్యాంకు ఏపీకే అప్లికేషన్కు క్లిక్ చేయండి’ అని వాట్సప్కు ఓ బ్యాంకు లోగో డీపీగా ఉన్న నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. బాధితుడి వెంటనే లింక్ను క్లిక్ చేయగానే ఫోన్ సాఫ్ట్వేర్ అలర్ట్ వచ్చింది. దీంతో వెంటనే యాప్ను అన్ఇన్‌స్టాల్ చేశాడు. జరిగిందంతా తన స్నేహితులతో చెప్పి ఫోన్ను ఫార్మాట్ చేశాడు. నగరానికి చెందిన మరో ప్రైవేట్ ఉద్యోగికి సైతం కస్టమర్ సపోర్ట్ పేరుతో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ వాట్సప్కు మెసేజ్ వచ్చింది. దీంతో యాప్ ఇన్‌స్టాల్ చేయగానే అతని పేరుపై ఈసిమ్‌ యాక్టివేట్ అయిందని సందేశం వచ్చింది..

లింకులు క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ : వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 1.06 లక్షలు మాయం అయ్యాయి. డెబిట్ అయిన సందేశం కూడా ఫోన్కు రాకపోవడంతో ఖంగుతిన్నాడు. దీంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఏపీకే ఫైల్స్లను పంపి డబ్బులు కాజేశారని సుమారు 15 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవే కాదు ఇటీవల రుణమాఫీ సమయంలో ప్రభుత్వ బ్యాంకుల లోగోలతో ఏపీకే ఫైల్స్ సైబర్ నేరగాళ్లు రైతుల ఫోన్ నంబర్లకు పంపారు. తాజాగా మూసీ రివర్ బెడ్లో ఇళ్లు ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు కూడా ఏపీకే ఫైల్స్ పంపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి సంబంధం లేకున్నా వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు..