లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్…

*ప.గో:*

డెడ్‌ బాడీ పార్సిల్‌ కేసును ఛేదించిన పోలీసులు.

ఆస్తి కాజేసేందుకు స్కెచ్‌ చేసి హత్య చేసిన శ్రీధర్‌వర్మ.

ఈ కేసు నిందితుడు శ్రీధర్‌ వర్మ, రెండో భార్య రేవతి, మూడో భార్య సుష్మ అరెస్ట్‌.

వదిన తులసి ఆస్తిని కొట్టేసేందుకు నిందితుడు శ్రీధర్‌ వర్మ ప్లాన్‌.

ఈ నెల 17న పర్లయ్యను కారులో తీసుకెల్లి సుష్మతో కలిసి హత్య చేసిన శ్రీధర్‌ వర్మ…

శవం పార్సిల్ కేసులో వీడుతున్న చిక్కుముడి!

పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో కలకలం రేపిన పార్సిల్ శవం..

వదిన ఆస్తి కాజేసేందుకు భార్య, ప్రియురాలితో కలిసి మరిది పన్నాగం..

శవాన్ని పంపి భయపెట్టాలని పథకం..

శవం దొరక్కపోవడంతో వ్యక్తిని హత్య చేసి మరీ పార్సిల్ చేసిన వైనం..

ఆపై విషయం బయటపడటంతో ప్రియురాలు, కుమార్తెతో కలిసి పరారీ..

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 40 సిమ్‌కార్డులు మార్చిన నిందితుడు..

పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలోని ఓ ఇంటికి పార్శిల్‌లో వచ్చిన మృతదేహం కేసులో చిక్కుముడి దాదాపు వీడింది. వదిన తులసి ఆస్తిని కాజేసేందుకు నిందితుడు శ్రీధర్‌వర్మే ఇదంతా చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు, ఆమె రెండో భార్య
(తులసి చెల్లెలు), ప్రియురాలు సుష్మ కలిసి పర్లయ్యను హత్యచేసినట్టు విచారణలో అంగీకరించినట్టు తెలిసింది.

శవం దొరక్కపోవడంతో హత్య..
పోలీసుల కథనం ప్రకారం.. తులసి ఇంటికి శవాన్ని పంపి ఆమెను భయపెట్టాలని పథక రచన చేశారు. అందులో భాగంగా శవం కోసం గాలించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హతమార్చాలని నిర్ణయించారు. అతడికి మద్యం తాగించి మత్తులో ఉండగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకు నైలాన్ తాడు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత పర్లయ్య శవాన్ని చెక్కపెట్టెలో పెట్టి తులసి ఇంటికి పార్సిల్ చేశారు.

సంతకం పెడితే శవం మాయం చేస్తానని హామీ
పార్సిల్‌లోని శవాన్ని చూసిన తులసి భయంతో హడలిపోయింది. అది గమనించిన శ్రీధర్‌వర్మ ఆస్తి పత్రాలపై సంతకం చేస్తే విషయం బయటకు పొక్కకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆమె నిరాకరించడంతో ‘‘సంతకం పెడతావా? లేదంటే నువ్వు కూడా శవమవుతావా?’’ అని బెదిరించాడు. ఆమె సెల్‌ఫోన్‌ను లాగేసుకున్నాడు. దీంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాష్‌రూముకు వెళ్తానని చెప్పి తన వద్దనున్న మరో ఫోన్ ద్వారా తెలిసిన వారికి మెసేజ్ పంపింది. ఆ వెంటనే కొందరు తులసి ఇంటికి చేరుకుని ఏం జరిగిందని ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించడంతో శ్రీధర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ప్రియురాలు, కుమార్తెతో పరారీ
తులసి ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీధర్ ప్రియురాలు సుష్మ, కుమార్తెతో కలిసి కారులో కృష్ణా జిల్లా బంటుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్‌కు చేరుకున్నాడు. అక్కడ తాళ్లపాలెంలో కారును వదిలేసి లాడ్జిలో ఒక రోజు బస చేశారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. చివరికి అక్కడ పోలీసులకు దొరికిపోయారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ఏకంగా 40 సిమ్‌కార్డులను మార్చినట్టు గుర్తించారు. అలాగే, అతడి ఖాతాలో రూ. 2 కోట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నేడు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు..

ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ మంగళవారానికి వాయిదా.

కేసు వాయిదా…………

ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ మంగళవారానికి వాయిదా……….

కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు మంగళవారం వరకు పొడిగింపు……………

ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ మంగళవారానికి వాయిదా…………

మాజీ ఎంపీమంద.జగన్నాథం ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్……………

నిమ్స్ హాస్పిటల్ లో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు మంద జగన్నాధం ని పరామర్శించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్………

నిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ బీరప్ప ఇతర వైద్యులను అడిగి మందా జగన్నాథం ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు………

మందా జగన్నాథం కి మంచి చికిత్స అందించాలని వైద్యుల బృందానికి సూచించారు…………….

వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు………………

జనవరి 1 నుంచి ఈ మార్పులు

గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కార్ల ధరలు పెంచుతామని ప్రకటించిన పలు కంపెనీలు కొత్త ఏడాది నుంచి వాటిని అమల్లోకి తీసుకురానున్నాయి. దీంతో పాటు NBFC, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లలో నిబంధనలతో పాటు GST పోర్టల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూపీఏ 123పే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.5వేల నుంచి రూ. 10వేలకు పెరగనుంది…

*మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం.*

*అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం.*

*ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం.*

*వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశం.*

*జనవరి 1 వరకు జాతీయ జెండా అవనతం చేయాలని ఆదేశాలు.*

*నేడు ఉదయం 11 గంటలకు భేటీకానున్న కేంద్ర కేబినెట్.మన్మోహన్ మృతికి సంతాపం తెలపనున్న కేంద్ర కేబినెట్..

*నేడు ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి*

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.ఇవాళ ఉదయం 10 గంటలకు కర్ణాటక నుంచి బయలుదేరి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.అక్కడ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థీవ దేహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించనున్నారు.అనంతరం ఇవాళ సాయంత్రం తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.

బోర్న్ టెస్టు కష్టాల్లో టీమ్ఇండియా..

బోర్న్ టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 310 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. భారత్ ఫాలో ఆన్‌ గండం తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

మెరుగైన స్థితిలో కనిపించినా
రెండో రోజు తొలి సెషన్లోనే టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (82 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించినా, కెప్టెన్ రోహిత్ శర్మ (3) మరోసారి తడబడ్డాడు. కేఎల్ రాహుల్ (24) కాసేపు ఆకట్టుకున్నా ఇన్నింగ్స్ను భారీ స్కోర్గా మలచలేకపోయాడు. అయితే జైస్వాల్- విరాట్ మాత్రం క్రీజులో కుదురుకుపోయారు. వీరిద్ధరూ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మూడో వికెట్కు ఈ జోడీ 102 పరుగులు జోడించింది. దీంతో భారత్ రెండు వికెట్ల నష్టానికే 150 పరుగుల మార్క్ అందుకుంది..మెరుగైన స్థితిలో కనిపించినా
రెండో రోజు తొలి సెషన్లోనే టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (82 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించినా, కెప్టెన్ రోహిత్ శర్మ (3) మరోసారి తడబడ్డాడు. కేఎల్ రాహుల్ (24) కాసేపు ఆకట్టుకున్నా ఇన్నింగ్స్ను భారీ స్కోర్గా మలచలేకపోయాడు. అయితే జైస్వాల్- విరాట్ మాత్రం క్రీజులో కుదురుకుపోయారు. వీరిద్ధరూ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మూడో వికెట్కు ఈ జోడీ 102 పరుగులు జోడించింది. దీంతో భారత్ రెండు వికెట్ల నష్టానికే 150 పరుగుల మార్క్ అందుకుంది..కానీ, అక్కడే కథ మలుపు తిరిగింది. 41వ ఓవర్లో జైస్వాల్ రనౌట్ అయ్యాడు. దీంతో సెంచరీ భాగస్వామ్యం బ్రేక్ అయ్యింది. కొద్దిసేపటికే క్రీజులో పాతుకుపోయిన విరాట్ కూడా ఔటయ్యాడు. తర్వాత వరుస వికెట్లు పడుతున్న క్రమంలో నైట్వాచ్మెన్గా ఆకాశ్ దీప్ (0)ను బరిలో దింపినా అతడు కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమ్ఇండియా 6 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140 పరుగులు) భారీ సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు సామ్‌ కాన్‌స్టాస్‌ (60 పరుగులు), ఉస్మాన్ ఖవాజా (57 పరుగులు), లబూషేన్ (72 పరుగులు), పాట్ కమిన్స్ (49 పరుగులు) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3, ఆకాశ్ 2, సుందర్ 1 వికెట్ పడగొట్టారు…

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్‌.. నేడు వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది..

విశాఖపట్నం : ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నెల్లూరుతోపాటు పలు జిల్లాలకు భారీ వర్షాలు పొంచిఉన్నట్లు తెలిపింది. గంటకు 65 కిమీ వేగంతో గాలులు విస్తాయని, రాష్ట్రంలోని అన్ని పోర్టులకు వాతావరణ శాఖ మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది. మరోవైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపనున్నట్లు తెల్పింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు చోట్ల చిరుజల్లులు పడుతుండగా.. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చలి తీవ్రత మరికాస్త పెరిగే అవకాశం ఉందని తెల్పింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని, దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల నేడు (శుక్రవారం) వానలు పడే సూచనలున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదికి ఇవే చివరి వానలనీ, ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకూ భారీ వర్షాలేవీ ఉండబోవని వాతావరణ శాఖ పేర్కొనడం విశేషం. ఈ నెలాఖరు నుంచి చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనీ, జనవరి 2వ వారం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది.

అయితే ప్రస్తుతం వానకాలం ముగిసి, శీతాకాలం కొనసాగుతుంది. సాధారణంగా ఈ కాలంలో వర్షాలు పడవు. కానీ అల్పపీడనం, వాయుగుండం, ఫెంగల్‌ తుపాన్‌ వంటి విపత్తులతో ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విలవిల్లాడింది. ఇకపై ఈ ధోరణి ఉండబోదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వచ్చే వేసవి కాలం వరకూ మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు, అల్పపీడనాలు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు..

హుజురాబాద్.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊరట…….

హుజూరాబాద్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి కాస్త ఊరట లభించింది……. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో విచారణ జనవరి 6కు వాయిదా పడింది.కాగా,
ఈ కేసుకు సబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ రావాలంటూ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే, తన తండ్రి హార్ట్ సర్జరీ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు తెలిపారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు జనవరి 6కు విచారణను వాయిదా వేశారు. అదేవిధంగా ఈ కేసులో కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో సహా మరో 20 మంది అనుచరులను పోలీసులు నిందితులుగా చేర్చారు……….

టీఎస్ టెట్ 2024 అడ్మిట్ కార్డు విడుదల..

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 కోసం తెలంగాణ పాఠశాల విద్యా శాఖ అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ టీజీ టెట్ 2024-II లేదా టీఎస్ టెట్ అడ్మిట్ కార్డ్ 2024ను అధికారిక వెబ్‌సైట్ (tgtet2024, aptonline.in) నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు…

అధికారిక తెలంగాణ టెట్ వెబ్‌సైట్‌..

(tgtet2024.aptonline.in)ను విజిట్ చేయండి.
హోమ్‌పేజీలో “Hall Ticket Download” లింక్‌పై క్లిక్ చేయండి.
కొత్తగా పేజీలో, జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వంటి మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
“Proceed” బటన్‌పై క్లిక్ చేయండి.
మీ (TS TET 2024) అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసి పరీక్ష పూర్తి అయ్యే ప్రింటవుట్ దగ్గర ఉంచుకోండి.
టీఎస్ టెట్ అడ్మిట్ కార్డ్ 2024..

టీఎస్ టెట్ 2025 పరీక్ష జనవరి 2 నుంచి జనవరి 20, 2025 వరకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 60శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది.
అయితే, బీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50శాతం స్కోర్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు, ఉత్తీర్ణత 40శాతం. గతంలో టీఎస్ టెట్ సర్టిఫికేషన్ ఏడేళ్లపాటు చెల్లుబాటు కాగా, ఇప్పుడు లైఫ్ టైమ్ చెల్లుబాటు అవుతుంది. టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో టెట్ స్కోర్‌లను ఉపయోగించవచ్చు. అదనంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహిస్తుందని ప్రకటించింది..

*కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి అస్వస్థత.

ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నారు.. తల్లి సోనియా వెంట ప్రియాంకా గాంధీ ఉన్నారు. . ఇదిలా ఉంటే గురు, శుక్రవారాల్లో కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు సోనియా, ప్రియాంక హాజరుకావాల్సి ఉంది.. కేవలం రాహుల్‌ మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు..

తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలకు టీటీడీ శుభవార్త..!

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు శుభవార్తను అందించింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం టీటీడీ నిర్ణయం తీసుకుంది..అయితే గత ప్రభుత్వ హయాంలో.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. ఇటీవల కాలంలో స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలోనే.. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారని.. తమకు కూడా.. విలువ ఇవ్వాలని విమర్శించారు.

వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో టీటీడీ సభ్యులతో చర్చించారు. ఈ క్రమంలో మెజారిటీ సభ్యులు.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో టీటీడీ బోర్డు.. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయించినట్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో ఇకపై ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెళ్లే భక్తులకు వారానికి రెండు సార్లు.. దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు…

శబరిమల ఆలయం మూసివేత..!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజలు ముగియడంతో అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భారీ సంఖ్యలో భక్తుల సందర్శనతో ఆలయం సందడిగా కనిపించిన ఈ పూజాకాలం ముగిసింది…ఈ నెల 30న తిరిగి ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. మండల పూజాకాలంలో శబరిమల ఆలయాన్ని దాదాపు 32.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల విశ్వాసం, క్రమశిక్షణ ఆలయ పరిసరాలను పునీతంగా నిలిపినట్లు ఆలయ అధికారులు తెలిపారు..జనవరి 14న శబరిమల కొండపై భక్తులు మకరజ్యోతిని దర్శించుకోనున్నారు. ఈ ప్రత్యేక ఘట్టానికి దేశవ్యాప్తంగా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. మకరజ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ఇక జనవరి 20న పడిపూజతో శబరిమల యాత్ర ముగియనుంది. ఈ పూజతో కలిసి అయ్యప్ప స్వామి భక్తులు తాము తీసుకున్న దీక్షను ముగించుకుంటారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పూజతో యాత్రకు పూర్తి స్థాయి ముగింపు కలుగుతుంది..

ఉగ్రదాడుల కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి..!

ముంబై ఉగ్రదాడి కుట్రదారు, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ ఈరోజు పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించారు..అయితే, గత కొద్ది రోజులుగా లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మధుమేహ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ.. ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారని జమాత్-ఉద్-దవా అధికారి ధృవీకరించారు. కాగా, 2019 మేలో మక్కీని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 2020లో పాకిస్తానీ ఉగ్రవాద నిరోధక కోర్టు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో అతనిని దోషిగా నిర్ధారించడంతో అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

అలాగే, 26/11 ముంబై టెర్రర్ దాడులకు ఆర్థిక సహాయం అందించడంలో హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ కీలక పాత్ర పోషించారు. దీంతో 2023లో మక్కీని ప్రపంచ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించింది. దీంతో అతడి ఆస్తులను జప్తు చేయడంతో పాటు ఆయన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. జూడి కార్యకలాపాల ముసుగులో మిలిటెంట్ కార్యకలాపాలకు నిధుల సమీకరణ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు రావడంతోనే ఈ చర్యలు తీసుకుంది.