నితీష్ కుమార్ రెడ్డి.. బ్యాట్ తో నీ అవ్వ తగ్గేదేలే..!

81 బంతుల్లోనే… 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి..

Nitish Kumar Reddy Maiden fifty: నీ అవ్వ తగ్గేదేలే …

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఈ తెలుగోడు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు..టెస్ట్ కెరీర్‌లో నితీష్ కుమార్ రెడ్డికి ఇదే తొలి హాఫ్ సెంచరీ..

https://x.com/mufaddal_vohra/status/1872840540519284736?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1872840540519284736%7Ctwgr%5Ebe5261f94e23e1d2e3f2c6c179d0379e53bb3bbd%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

గత మూడు టెస్ట్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42, 16 పరుగులతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న నితీష్.. తాజా మ్యాచ్‌లో మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో అర్థశతకం సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి.. తనదైన బ్యాటింగ్‌తో 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మిచెల్ స్టార్క్ వేసిన 83వ ఓవర్ మూడో బంతిని ఆఫ్ సైడ్ డ్రైవ్‌తో బౌండరీ బాది హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అర్థ శతకం పూర్తయిన వెంటనే నితీష్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. పుష్ప ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్.. ‘నీ అవ్వ తగ్గేదేలే’అంటూ బ్యాట్‌తో ఫోజిచ్చాడు. ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-1, పుష్ప-2 చిత్రాలు సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఈ సినిమాకు ఆదరణ దక్కింది. నితీష్ కుమార్ రెడ్డి కంటే ముందు చాలా మంది క్రికెటర్లు, ఫుట్‌బాల్ స్టార్స్.. పుష్ప ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

ప్రస్తుతం పుష్ప మూవీ సినీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి’నీ అవ్వ తగ్గేదేలే’అంటూ తెలుగోడి సత్తా ఇది అని చెప్పడం చర్చనీయాంశమైంది.

164/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన రిషభ్ పంత్(28) అనవసర షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి.. రాగా జడేజా ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని నాథన్ లయన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి నితీష్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

సుందర్ నెమ్మదిగా ఆడినా నితీష్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు. దాంతో భారత్ 244/7 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్‌లో ఆసీస్ చేతికి అంపైర్లు కొత్త బంతి ఇచ్చినా.. నితీష్ జాగ్రత్తగా ఆడుతూ హా ఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.