తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ప్రకటించింది…

సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.

👉శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌

👉మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్‌ తీర్మానం.

👉 రేవంత్‌ తీర్మానానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్‌.

సీఎం రేవంత్‌ కామెంట్స్‌..

మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలకు మన్మోహన్‌కు రుణపడి ఉంటారు. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారం ఆయనను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ అంటే మన్మోహన్‌కు ప్రత్యేక అభిమానం ఉండేదని ఆయన సతీమణి తెలిపారు. ఆయన కుటుంబం చాలా నిరాడంబరంగా ఉంటుంది. గొప్ప విలువలతో తన కుటుంబాన్ని నడిపించారు. మన్మోహన్‌ పరిపాలనతోనే మనం గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలిగాం. మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరవలేం. ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా మన్మోహన్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం.

ప్రజలకు ఉపయోగపడే సంస్కరణల్లో ఆయన వెనకడుగు వేయలేదు. భూసేకరణ చట్ట సవరణ ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూర్చారు. భూసేకరణ చట్టం-2013 ద్వారా చేతి వృత్తులు, కుల వృత్తుల వారు లబ్దిపొందారు. మన్మోహన్‌ చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి. పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే అది ఆయన చలువే. అంబేద్కర్‌ స్పూర్తితో పరిపాలన చేశారు. మన్మోహన్‌ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, మానవతావాది. ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నామంటూ ఆయన సంస్కరణలే కారణం అని చెప్పుకొచ్చారు.

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. పనే ధ్యాసగా పనిచేశారు. బ్యూరోక్రాట్‌గా వివిధ దశల్లో పనిచేసి మన్మోహన్‌ దేశ ప్రధాని అయ్యారు. నీతి, నిజాయితీతో మన్మోహన్‌తో పోటీ పడేవారు లేరు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన పనే లక్ష్యంగా మన్మోహన్‌ ముందుకు సాగారు. మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్‌..

ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందించారు. మన్మోహన్‌ సంస్కరణలతో అనేక కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. సమాచార హక్కు చట్టాన్ని 2005లో తీసుకువచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసింది. ఆర్థిక మాంద్యం బారినపడకుండా ఉపాధి హామీ పథకం కాపాడింది. దేశ సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకుని చట్టాలు చేశారు.

ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దశాబ్దాలుగా కొట్లాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. విపక్షాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేశారు. మన్మోహన్‌ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మన్మోహన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. అసామాన్యమైన మహా మనిషి మన్మోహన్‌. దేశం కోసం ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు. మన్మోహన్‌ భారత్‌లో పుట్టినందుకు గర్వపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం.

కేటీఆర్‌ కామెంట్స్‌...
మన్మోహన్ సింగ్ నిబద్ధతతోనే తెలంగాణ ఏర్పడింది. సీఎం రేవంత్‌ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. మన్మోహన్‌ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే. ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా మౌనంగా భరించారు. అయినా అవన్నీ పంటి కింద బిగబట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి. పీవీ నర్సింహారావు తెలంగాణ బిడ్డ. ఢిల్లీలో మెమోరియల్ లేదు. అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసన సభ తీర్మానం చేయాలి.

రాజకీయాలతో సంబంధం లేని ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచం అంతా దేశం వైపు చూసే విధంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక నిర్ణయాలు ఉన్నాయి. లాయల్టీకి నిలువుటద్దంగా నిలిచిన గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్. కేసీఆర్‌కు షిప్పింగ్ పోర్టుపోలియో ఇస్తే డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగానే కేసీఆర్ తెలంగాణ కోసం అది త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగింది. తెలంగాణ డెలిగేషన్ తీసుకొని మన్మోహన్ సింగ్‌ను కలిశాం. 5 నిమిషాలు కాదు, ఎక్కువ సమయం కావాలని అడిగాం. సమస్య తీవ్రత తెలుసుకొని గంటన్నర సమయం ఇచ్చారు. ఓబీసీ అంశాలపై బలహీన వర్గాల డెలిగేషన్ ఢిల్లీ వెళ్లి కలిసింది.

మన్మోహన్ సింగ్‌కు జరిగిన గౌరవ వీడ్కోలు.. మన పీవీ నరసింహారావుకు దక్కలేదు. ఢిల్లీలో అందరి ప్రధాన మంత్రులకు ఘాట్స్ ఉన్నాయి. పీవీకి తప్ప. పీవీకి ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేలా సభలో తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. మన్మోహన్ సింగ్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసినా మేమంతా వస్తాం.

మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..

దేశాభివృద్ధికి మన్మోహన్‌ సింగ్‌ అనేక గొప్ప విధానాలు తెచ్చారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికమంత్రిగా పీవీ నరసింహారావు ఎంపిక చేశారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం తెచ్చారు.

బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌..

బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌..

ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌..

కూనంనేని కామెంట్స్‌..

హరీష్‌ రావు కామెంట్స్‌..