చైనాను వణికిస్తున్న వైరస్‌పై అప్రమత్తమైన భారత ప్రభుత్వం…

BREAKING

ఢిల్లీ

*చైనాను వణికిస్తున్న వైరస్‌పై అప్రమత్తమైన భారత ప్రభుత్వం*

చైనాలో శరవేగంగా విస్తరిస్తున్న HMPV వైరస్

వైరస్ బాధిత రోగులతో నిండిపోయిన చైనా ఆస్పత్రులు

*ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ (NCDC)ను ఆదేశించిన కేంద్ర ఆరోగ్యశాఖ*

శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచన

అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్న భారత ప్రభుత్వం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర అనుబంధ ఏజెన్సీల నుంచి డిసెంబర్ 16-22 మధ్య వచ్చిన డేటా ప్రకారం చైనాలో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా, రైనోవైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తీవ్రమయ్యాయి.