*తెలంగాణ పోలీస్ వారి హెచ్చరిక*
*చైనీస్ మాంజా అమ్మినా లేదా నిల్వ చేసినా కఠిన చర్యలు*
చైనీస్ మాంజా అమ్మకం లేదా నిల్వపై కఠిన చర్యలు తీసుకొవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. మానవ ప్రాణాలకు, పక్షులు, జంతువులకు హాని కలిగించే నిషేధిత చైనా మాంజపై *SHO* లందరూ సీరియస్ గా దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సూచించారు.
పలు షాపుల్లో నాన్ బయో డీగ్రేడబుల్, సింథటిక్ ఉత్పత్తులతో తయారు చేసిన నిషేధిత చైనీస్ మాంజాను కలిగి ఉన్న అమ్ముతున్న దుకాణాలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ప్రధానంగా మాంజా కొనుగోలు చేసే కస్టమర్లు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాంపౌండ్ వాల్స్ లేదా రెయిలింగ్ ఉన్న భవనాల నుంచి గాలిపటాలు ఎగురవేయాలని అధికారులు ప్రజలను కోరారు. మానవ ప్రాణాలకు, పక్షులకు, జంతువులకు హాని కలిగించకుండా ఉండటానికి చైనీస్ మాంజాను కొనుగోలు చేయవద్దని సూచించారు. స్ధానిక పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు..