Passports: పాస్ పోర్ట్ పొందడం మరింత సులువు.. వారం రోజుల్లోనే..!

పాస్ పోర్ట్ అపాయింట్ మెంట్ గడువు 6 నుంచి 8 రోజులకు కుదించినట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిణి స్నేహజ చెప్పారు.తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.2023లో పాస్ పోర్ట్ అపాయింట్ కోసం 22 రోజుల సమయం పట్టేదని ఆమె గుర్తు చేశారు.వరంగల్ లో అత్యధికంగా రోజుకు 130, మిగతా కేంద్రాల్లో 90 చొప్పున దరఖాస్తులు పరిశీలించామని ఆమె తెలిపారు.తమ కార్యాలయం పరిధిలో ఐదు పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆమె వివరించారు. గత ఏడాది సగటున రోజుకు 4,200 అప్లికేషన్లు పరిశీలించామని ఆమె చెప్పారు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజల నుంచి అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని ఆమె అన్నారు.మెయిల్స్ ద్వారా 10 వేల మంది సమస్యలను పరిష్కరించిన విషయాన్ని అధికారులు చెప్పారు. గత ఏడాది 9.02 లక్షల దరఖాస్తులను పరిష్కరించామన్నారు…