పంచాయతీల ఎన్నికలకు ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం..!.. ఇంకా గుర్తులు వచ్చేశాయ్‌..!

జిల్లాలో పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడకముందే అధికారులు ఏర్పాట్లను మాత్రం ముమ్మరం చేస్తున్నారు..ఇప్పటికే ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల విధుల ప్రవర్తనా నియామావళి, శిక్షణకు సంబంధించిన పుస్తకాలు జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉన్నతాధికారులు పంపించారు. గతేడాది డిసెంబరు 17న గుర్తించిన పోలింగ్‌ కేంద్రాలకు కలెక్టర్‌ ఆమోద ముద్ర వేశారు. అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను సిద్ధంగా ఉంచారు. ఎన్నికల్లో కీలకమైన 11 అంశాలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు. తాజాగా ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గుర్తులను కేటాయించింది. వీటికి సంబంధించిన సర్క్యులర్‌ జిల్లా పంచాయతీ అధికారులకు చేరింది. ఆమేరకు నిర్ణీత ఎన్నికల గుర్తులను ముద్రించేందుకు కసరత్తు చేస్తున్నారు. సర్పంచి అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 రకాల గుర్తులను బ్యాలెట్‌ పత్రాల్లో ముద్రించబోతున్నారు. రాజకీయ పార్టీల రహితంగా జరిగే ఎన్నికలు కావడంతో గ్రామీణ ఓటర్లకు అవగాహన ఉన్న గుర్తులనే ముద్రించనున్నారు. సర్పంచి అభ్యర్థులకు బ్యాలెట్‌ గులాబీ రంగు, వార్డు సభ్యుల బ్యాలెట్‌ తెలుపు రంగు కాగితాలపై ముద్రించనున్నామని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ చెప్పారు.

సర్పంచి అభ్యర్థులకు: ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్‌హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మాన్, మనిషి తెరచాప పడవ, బిస్కట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ, స్టంప్స్‌.

వార్డు సభ్యులకు: గౌను, గ్యాస్‌ పొయ్యి, స్టూల్, సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్‌యాంటీనా, గరాట, మూకుడు, ఐస్‌క్రీం, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ బంతి, నెక్‌టై, కటింగ్‌ప్లేయర్, పెట్టె, స్తంభం కేటిల్‌. బ్యాలెట్‌ పత్రం

చివరన నోటా: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే ఓటును నోటాకు వేయొచ్చు. ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల గుర్తుల చివరన నోటా గుర్తును కేటాయించిన మాదిరిగానే బ్యాలెట్‌ పత్రాల్లో సర్పంచులు, వార్డు సభ్యులకు కేటాయించిన గుర్తుల చివరన నోటా గుర్తును ఏర్పాటు చేయనున్నారు.

ఇవీ వివరాలు

సర్పంచులకు 30.. వార్డు సభ్యులకు 20

– నోడల్‌ అధికారుల నియామకం

– 2268 పోలింగ్‌ కేంద్రాలు

– మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు

– జిల్లాలో 260 సర్పంచ్‌, 2268 వార్డు సభ్యుల.