లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్. .

రేవంత్ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుండి రూ.500 కోట్లు తీసుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చాడు..బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వను అని చెప్పి.. ఇవాళ సినిమా వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి దిల్ రాజును అడ్డం పెట్టుకొని ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుండి రూ.500 కోట్లు తీసుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చాడు

రేవంత్ రెడ్డి నీది నోరా.. మోరీనా?

రేవంత్ రెడ్డి నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం లేదా?.. ఎందుకంటే నువ్వే పర్మిషన్ ఇవ్వను అని చెప్పి రూ.500 కోట్లు డబ్బులు తోసుకొని పర్మిషన్ ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు అని కూడా లేదా – …

ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. బస్సులో సీట్ల కోసం నిత్యం గొడవలు

హైదరాబాద్ – మెహదీపట్నం నుంచి గండి మైసమ్మ రూట్లో అవసరమైనన్ని సర్వీసులు లేకపోవడంతో నిత్యం బస్సుల్లో సీట్ల కోసం గొడవలు పడుతున్న ప్రయాణికులు.

అంతేగాక గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం రద్దీ సమయాల్లో ఈ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని వాపోతున్న ప్రయాణికులు.

స్త్రీలకు ప్రత్యేక స్వీట్లు ఉన్నా జనరల్ సీట్లలో కూర్చోవడంతో పురుషులతో గొడవ జరుగుతోందని.. బస్ సర్వీసులను పెంచాలని కోరుతున్న ప్రయాణికులు..

అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదు.. అమ్మ లేనిదే సృష్టి లేదు..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

మగతనం చూపించాలంటే జిమ్నాస్టిక్స్ చేయండి, ఆర్మీలో చేరండి

అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే తొక్కి నారా తీస్తాం

క్రిమినల్స్‌కి కులం లేదు.. ప్రజాప్రతినిధులకు కులం లేదు.. తప్పు చేసిన ఎవడినైనా శిక్షించండి..

తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలి – పవన్ కళ్యాణ్.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి

సారీ చెప్పడానికి నామోషీ ఎందుకు.. అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారు…సంక్రాంతి వేడుకలను చాలా అద్భుతంగా జరుపుదాం అనుకున్నాను.. కానీ తిరుపతి తొక్కిసలాట ఘటన వల్ల ఈసారి జరపలేకపోతున్నాము..

సినిమా టికెట్ రేట్లపై, అదనపు షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి..

బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు

అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు

తదుపరి విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా..

గోషామహల్లో మరోసారి కుంగిన చాక్వాడి నాలా..

నాలాలో ఇరుక్కుపోయిన క్రషర్ లారీ

హైదరాబాద్ – గోషామహల్లో మరోసారి చాక్వాడి నాలా కుంగి కూరుకుపోయిన క్రషర్ లారీ.. ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్

ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు చేస్తుండగా ఇప్పుడు మరో నాలా కుంగడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు

నాలా మొత్తం పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు..

సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో పెంపు లేదు కానీ టీజీఆర్టీసీ బస్సుల్లో 50 శాతం పెంపు!

సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరిట 50 శాతం దోపిడీకి సిద్ధమైన టీజీఆర్టీసీ

10, 11, 12, 19, 20 తేదీల్లో సంక్రాంతి పండుగకు బస్సుల్లో టికెట్ రేట్లు 50 శాతం పెంచి 6,432 స్పెషల్ బస్సులు నడపనున్న టీజీఆర్టీసీ

మరోవైపు సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుండి ఆంధ్రకు వెళ్లే బస్సుల్లో టికెట్ మీద అదనపు చార్జీలు ఉండబోవని ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ..

ఏపీ ప్రజలను ప్రధాని మోడీ దారుణంగా వెన్నుపోటు పొడిచారు.. వైఎస్ షర్మిల..

ఏపీ ప్రజలను ప్రధాని మోడీ దారుణంగా వెన్నుపోటు పొడిచారు. హోదా ఇస్తామని మోసం చేశారు.. అంటూ వైఎస్ షర్మిల ఓటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు..

మొన్న మోడీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదు. ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు గురించి మాట్లాడలేదు. కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. అలాంటి పార్టీతో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇదెక్కడి న్యాయం. ఏపీ ప్రజలను దారణంగా మోసం చేసిన మోడీతో చంద్రబాబుది సక్రమ సంబంధం అయితే… జగన్‌ది అక్రమ సంబంధం. బడుగు బలహీన వర్గాల ఓట్లుతో గెలిచిన జగన్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను గంగలో కలుపుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మతతత్వ బీజేపీని నిరంతరం వ్యతిరేకించారు. ఆయన వారసులమని చెప్పుకునే జగన్ బీజేపీతో ఎందుకు కొమ్ముకొస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది నేను మాత్రమే. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం..

వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్ల జారీ విషయంలో బాధ్యతా రాహిత్యం…ముఖ్యమంత్రి చంద్రబాబు..

వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్ల జారీ విషయంలో బాధ్యతా రాహిత్యం కనబరిచి భక్తుల మృతికి కారణమయ్యే పరిస్థితులకు ఆస్కారమిచ్చిన డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిలను సస్పెండ్ చేయడం జరిగింది. టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్‌తో పాటు ఎస్పీ సుబ్బారాయుడులను బదిలీ చేసాం. అంతేకాదు జరిగిన ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించాం అన్నరు..

*🔹తెలంగాణలో 3 MLC స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన*

*• నల్గొండ-ఖమ్మం-వరంగల్‌..*
టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి..

*• కరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌..*

టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య..

*• కరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌..*
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి..

నడ్డా ఆదేశాలతో అభ్యర్థులను ప్రకటించిన కిషన్‌రెడ్డి