సంక్రాంతి ఎఫెక్ట్..భారీగా ట్రాఫిక్ జామ్..
10 టోల్బూత్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనాలు..
సంక్రాంతి ఎఫెక్ట్..
హైదరాబాద్ KPHB బస్ స్టాప్ నుండి ఏపీ కి తరలి వెళ్తున్న ప్రయాణీకులు…
సంక్రాంతి సందర్భంగా ఖాళీ అవుతున్న హైదరాబాద్ పండగకు సొంత ఊళ్లకు ప్రజలు పయనం
కూకట్ పల్లిలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బస్టాంప్ లు
భారీగా ట్రాఫిక్ జామ్…..
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. 10 టోల్బూత్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనాలను టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను ఆరు గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్పాస్ నిర్మాణ పనుల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది..
సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లె బాట పట్టిన నగరవాసులు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుండి కొనసాగుతున్న వాహనాల రద్దీ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా ల వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతున్నది.వాహనాల రద్దీన్ నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా లో మొత్తం టోల్ బూతులు కలవు.. వాహనాల రద్దీ దృశ్య 10 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచిన టోల్ అధికారులు.. మామూలు రోజులలో 35,000 నుండి 45000 వాహనాలు వెళ్తాయని సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే యాభై ఐదు వేల వాహనాలు వెళ్లినట్లు ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. ఈరోజు జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దానికి తగ్గట్టుగానే ఇక్కడ వాహనదారులకు ఇబ్బందులు కలవకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. నాలుగు సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుండి వెళ్తుంది,నిమిషానికి 330 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లు సమాచారం..