🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 18 – 01 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిథి : *పంచమి* పూర్తి,
నక్షత్రం : *పుబ్బ* మ3.11 వరకు,
యోగం : *శోభనం* రా1.51 వరకు
కరణం : *కౌలువ* సా6.16 వరకు,
వర్జ్యం : *రా11.02 – 12.47,*
దుర్ముహూర్తము : *ఉ6.37 – 8.06,*
అమృతకాలం : *ఉ8.17 – 10.01,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.43,
*_నేటి మాట_*
*దైవ లీలలు సామాన్యులకు అంతుపట్టవు!!*
భస్మాసురునికి వరమిచ్చాడు శివుడు…
కానీ, దానిని పొందిన భస్మాసురునికి కృతజ్ఞత లేక పోయింది.
తనకు వర మిచ్చిన దైవము నే పరీక్షింప దలచాడు, కానీ, ఈశ్వరుడు’ లయ’ కారుడు, ఈశ్వరునికి ఇపుడు రక్షణ బాధ్యత లేదు.
కనుక ఈశ్వరుడు, రక్షణ బాధ్యత ఉన్న విష్ణువు కి బాధ్యత ఇచ్చాడు, ఐతే భస్మాసురుని ఏవిధంగా శిక్షించాలి? ఈశ్వరుని వరమునకు విరుధ్ధముగాకుండా, తన రక్షణ జరగాలి.
అందుకే విష్ణువు చక్కని డ్రామా ను నటించాడు,
తాను అందమైన స్త్రీ గా( మోహిని) గా రూపొంది, భస్మాసురుని ఆకర్షించాడు.
నేను చేసిన రీతిగా చేస్తే వరిస్తానన్నాడు, మోహము, కోరిక వలన, వివేకము, విచక్షణ జ్ఞానము కోల్పోయి, మోహిని చెప్పినట్లెల్ల ఆడి పాడి, మోహిని తలపై చేయి పెట్టుకున్నట్లు తాను కూడా తనచేతిని తలపై ఆనించుకొని, వెంటనే భస్మము ఐ పోయాడు.
తన హస్తమే తనను భస్మము గావించింది.
ఇక్కడ ధర్మమునకు విరుధ్ధముగాకుండా రక్షణ జరిగింది!!…
దైవ లీలలు సామాన్యులకు అర్ధముకావు, ఎందుకు భగవంతుడు ఇట్లా చేశాడు, అట్లాచేశాడు, అనుకుంటూ ఉంటారు మానవులు!!…
దైవానికి శరణాగతి అయితే కొంత అనుగ్రహమును పొందగలము, అర్ధము చేసుకోగలము… శరణాగతి ముఖ్యం.
*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏