నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 21 – 01 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,

తిథి : *సప్తమి* ఉ11.06 వరకు,
నక్షత్రం : *చిత్ర* రా10.26 వరకు,
యోగం : *ధృతి* తె3.05 వరకు,
కరణం : *బవ* ఉ11.06 వరకు
తదుపరి *బాలువ* రా1.12 వరకు,

వర్జ్యం : *తె4.38 – 6.24,*
దుర్ముహూర్తము : *ఉ8.51 – 9.35,*
మరల *రా10.54 – 11.45,*
అమృతకాలం : *మ3.20 – 5.07,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.45,

*_నేటి మాట_*

*ఈ కలియుగంలో ఎవరితో స్నేహం చేయాలి???*

_వైదిక ధర్మమార్గ పరతాః!!_
మానవజన్మ, పుంస్త్వ లక్షణాలు, విప్రత్వం.. ఇవి లభించటం నిజంగా వరమే, అయితే ఈ లక్షణాలతో ముందుకు పోయినప్పుడే గదా ప్రయోజనం.
నా దగ్గర సరైన మందు ఉందిగదా అని కూర్చుంటే రోగం తగ్గిపోతుందా.
ఆ మందు సేవిస్తేనే గదా ఉపయెగం..

అలాగే పై లక్షణాలు గలవాడు ముందుకు పోవాలంటే ఏమిటి మార్గం.. వేదాలు చూపిన ధర్మమైన మార్గంలో ముందుకు నడవాలనే నిష్ఠ ఉండాలంటున్నారు.

మన బుద్ధిని ఏకాగ్రం చేసుకొనుటకు వేదాలు కొన్ని మార్గాలు మనకు చూపుతాయి.

*… అవే!!…*
నిస్వార్థ కర్మాచరణ,
మానసిక పూజ,
జపం,
తపం (ధ్యానం),
శ్రవణ,
మనన,
నిధిధ్యాసన
మొదలైన సాధనలు.
.
ఇవి సక్రమంగా ఆచరించినప్పుడు మన అంతరంగం పరిశుద్ధమౌతుంది.
మనస్సు శాంతించి ధ్యానానుకూలమవుతుంది, భగవంతుని పట్ల ఏకాగ్రత కుదురుతుంది.

కనుక.. “సత్త్వగుణ ప్రధానులై వేదాంత శాస్త్రాలను శ్రవణం చేస్తూ అవి చూపే మార్గాన ప్రయాణం చేయాలి”.. అట్టి మనోబుద్ధులు కలిగి ఉండటమే గొప్ప అదృష్టం…
వేద విరుద్ధ మార్గాల వైపుకు ఆకర్షించబడితే ఈ లభించిన జన్మ కూడా వృధాయే.
వేదాలను, వేదాంతాన్ని, భగవద్గీతను ఎగతాళి చేసే వారితో చేరకూడదు, ఎప్పుడూ ఏదైనా భగవంతుని చర్చించుకునే స్నేహితులు, బంధువులు, మిత్రులు దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకేమి వుంటుంది…

స్వస్తి🙏

_*🌷శుభమస్తు🌷*_
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏