లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

*మీర్‌పేట్‌ మర్డర్‌ కేసులో తాజాగా మరో షాకింగ్ ట్విస్ట్..!*

ఓ సినిమా స్పూర్తితోనే తన భార్యను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులకు తెలిపిన నిందితుడు గురుమూర్తి.

‘సూక్ష్మదర్శిని’ సినిమా తరహాలో మాధవి మృతదేహాన్ని మాయం చేసినట్లు సమాచారం.

ఆ సినిమాలో దత్తత కూతురిని తల్లి, కొడుకు కలిసి హతమార్చడమే కాకుండా.. ఆమె శరీర భాగాలను ఓ కెమికల్ ట్యాంకులో వేసి కరిగించినట్లు ఉండే సీన్.

దీనిని ఆధారంగా చేసుకునే భార్య మాధవి డెడ్‌ బాడీని గురుమూర్తి మాయం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి..

*పద్మశ్రీ ఇచ్చే స్థాయి గద్దర్ కి లేదు..కేంద్రమంత్రి బండి సంజయ్.*

*గద్దర్ బీజేపీ కార్యకర్తలను హత్య చేపించాడు.*

*మా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ మీద పాటలు పాడిండు.*

*ఎంతోమంది పోలీసులను చంపేశాడు.

*రోజాకు మంత్రి నారా లోకేష్ కౌంటర్..*

*ఆమెకు అసలు దావోస్‌కు, జ్యూరిక్‌కు తేడా తెలియదంటూ సెటైర్లు*

మాజీ మంత్రి రోజా.. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రోజాకు అసలు దావోస్‌కు, జ్యూరిక్‌కు తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. వాటిపై అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారన్న లోకేష్.. వైసీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకుంటే పరిశ్రమలు ఎందుకు నెలకొల్పలేకపోయారని ప్రశ్నించారు. రెడ్ బుక్ గురించి మరోసారి ప్రస్తావించిన నారా లోకేష్.. చట్టాన్ని ఉల్లఘించి వేధింపులకు పాల్పడినవారిని వదిలేది లేదని హెచ్చరించారు.

దావోస్‌లోనూ రెడ్ బుక్ గురించి మాట్లాడారంటూ మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా చేసిన విమర్శలకు.. ఏపీ మంత్రి నారా లోకేష్ కౌంటరిచ్చారు. జ్యూరిక్‌లో తాము దిగిన రోజున అక్కడున్నవారు చంద్రబాబును కలవాలని కోరినట్లు నారా లోకేష్ చెప్పారు. దీంతో జ్యూరిక్‌లో 700 మందితో మీటింగ్ పెట్టామని.. అక్కడ ఓ వ్యక్తి రెడ్ బుక్ గురించి మాట్లాడాలని కోరినప్పుడు.. తాను రెడ్ బుక్ గురించి మాట్లాడినట్లు నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. పరువు నష్టం కేసులో నారా లోకేష్ సోమవారం విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగానే చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. దావోస్ పర్యటన ద్వారా పక్క రాష్ట్రాలు వేలకోట్లు పెట్టుబడులు తీసుకువస్తే.. చంద్రబాబు బృందం ఖాళీ చేతులతో రాష్ట్రానికి తిరిగి వచ్చిందని రోజా విమర్శించారు. ఈ నేపథ్యంలో రోజా విమర్శలపై నారా లోకేష్ స్పందించారు. మాజీ మంత్రి రోజాకు దావోస్‌కు, జ్యూరిక్‌కు తేడా తెలియదంటూ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. రోజాకు వాటిపై అవగాహన లేదన్నారు. జ్యూరిక్‌లోనూ ఓ వ్యక్తి కోరిన కారణంగానే రెడ్ బుక్ గురించి మాట్లాడానన్న లోకేష్.. రెడ్ బుక్ అంటే వైసీపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు.

ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి, ప్రజలను, తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించారో వారిని వదిలే ప్రసక్తేలేదని నారా లోకేష్ స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించనప్పుడు మీకెందుకు భయమని ప్రశ్నించారు. రాజకీయాలలో పాదయాత్ర ఎంబీఏ లాంటిదన్న నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందన్న నారా లోకేష్… అన్ని వ్యవహారాలపై విచారణ ఒకేసారి జరిగితే ఉన్న పోలీసులు సరిపోరని అన్నారు. అన్ని అక్రమాలపైనా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలలలో ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామనీ, ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు తెచ్చామని నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగితే ఎందుకు పరిశ్రమలు స్థాపించలేకపోయారని ప్రశ్నించారు. దావోస్‌లో మహారాష్ట్రకు ఎక్కువ పెట్టుబడులు రావటానికి ఒకే ప్రభుత్వం కొనసాగడం కారణమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు..

*రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ కూడా !*

రీజనల్ రింగ్ రోడ్‌తో హైదరాబాద్‌ను మరింతగా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజినల్ రింగ్‌ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన‌ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్రమంత్రి ఆర్ఆర్ఆర్ చుట్టూ రీజినల్ రింగ్‌ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును సైతం చేపడితే ఒకే సమయంలో వేగంగా పనులు పూర్తవుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రీజినల్‌ రింగు రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రైలుతో తెలంగాణ రాష్ట్రం 60 శాతం పట్టణీకరణ జరుగుతుందని అది గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ 200 కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

రీజినల్ రింగ్‌ రైల్వే లైను ఏర్పాటైతే తెలంగాణకు ఆటోమొబైల్, ఈవీ వాహన తయారీ పరిశ్రమలు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ మార్గంపై సర్వే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇప్పటికే ఆదేశించారని కిషన్ రెడ్డి చెబుతున్నారు. , డీపీఆర్‌ రూపకల్పనతో పాటు స్థల నిర్ధారణ తుది సర్వే చేయడానికి రైల్వే శాఖ 13.95 కోట్లను కేటాయించింది. మొత్తం 340 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్ పరిసరాల్లో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజినల్ రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనతో రియల్ ఎస్టేట్ మంరింతగా పుంజుకుంటుంద‌ని రియాల్టీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు..

విసన్నపేటలో వింత చోరీ..

మండల కేంద్రం విస్సన్నపేట సత్తుపల్లి రోడ్డులో శ్రీనివాస థియేటర్ వెనుక వున్న .సుస్వదీప్ ఆగ్రో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్ సేల్ డీలర్ షాపులో తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగ మూడు సర్ఫ్ ప్యాకెట్ల బస్తాలను తస్కరించాడు..బీరువాలో ఉన్న నగదు జోలికి వెళ్లకుండా కేవలం సర్ఫ్ ప్యాకెట్లను దొంగలించాడు.. పోలీసు అధికారులు తమ వ్యాపార సముదాయాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది వ్యాపారులలో మార్పు రావడం లేదు
కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ…. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు…..

ముస్లింలపై కోపంతో అబ్దుల్ కలాం విగ్రహం పనులు నిలిపివేసిన కాంగ్రెస్ వెడ్మ బొజ్జు.

ముస్లింలపై ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అహంకారపు మాటలు

ఒక ముస్లిం వ్యక్తి తనను తిట్టాడని, ఖానాపూర్ మున్సిపాలిటీలో కడుతున్న అబ్దుల్ కలాం విగ్రహం పనులు నిలిపివేసిన వెడ్మ బొజ్జు..

మీ సంగతి చెప్తారంటూ, మీరంతా బ్రతుకెంతా అంటూ పరుష పదజాలంతో తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు… ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

బస్ భవన్ వద్ద భారీగా చేరుకున్న ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నేతలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలని సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు

21 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందించిన ఆర్టీసీ యూనియన్ నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 14 నెలలైనా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, మేనిఫెస్టోలో చెప్పినట్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్…

*Sri Lanka: అదానీకి శ్రీలంక భారీ ఝలక్‌*.

*విద్యుత్‌ ఒప్పందం రద్దు*

*లంచం ఆరోపణల దెబ్బ..!*

న్యూఢిల్లీ : అపర కుబేరుడు, ప్రధాని మోడీకి అత్యంత సన్ని హితుడిగా గుర్తింపు పొందిన గౌతమ్‌ అదానీకి శ్రీలంక కొత్త ప్రభుత్వం ఊహించని భారీ షాక్‌ ఇచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అదానీ సంస్థతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే సర్కార్‌ ప్రకటించింది. 2024 డిసెంబరులో గౌతమ్‌ అదాని పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లకు గాను అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక ఇంధన మంత్రిత్వశాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2024 మేలో వాయువ్య ప్రాంతంలో ఇప్పటికీ నిర్మించని అదానీ పవన విద్యుత్‌ కేంద్రం నుంచి కిలోవాట్‌కు 0.0826 డాలర్ల చొప్పున విద్యుత్‌ కొనుగోలు చేయడానికి ఇదివరకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాగా.. దిసనాయకే ప్రభుత్వం స్థానిక ప్రాజెక్టులపై దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మొత్తం అదానీ ప్రాజెక్టును సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
అదానీ ప్రతిపాదన ఖర్చులో దాదాపు మూడింట రెండొంతుల ధరకే చిన్న పునరుత్పాదన ఇంధన సంస్థలు విద్యుత్‌ అందిస్తున్నాయి. దీంతో అదానీ ఒప్పందంపై ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో శ్రీలంకలో అవినీతిని నిర్మూలించి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాననే హామీతో దిసనాయకే గతేడాది సెప్టెంబర్‌లో అధికారం చేపట్టారు. అదే విధంగా మన్నార్‌-పూనెరిన్‌ తీర ప్రాంతాల్లో అదాని 484 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టు పర్యావరణానికి హానికరమంటూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో అది పెండింగ్‌లో పడింది. లంచాలు ముట్టజెప్పి విద్యుత్‌ ఒప్పందాలు చేసుకుందని అదాని గ్రూపుపై నవంబర్‌ 19న అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే శ్రీలంక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావంతో శుక్రవారం బిఎస్ఇలో అదానీ ఎనర్జీ షేర్‌ ధర 2.57 శాతం పతనమై రూ.789.95 వద్ద ముగిసింది..

సినిమా థియేటర్లకు రాత్రి 11 తర్వాత 16 ఏళ్లలోపు పిల్లల్ని అనుమతించవద్దు: హైకోర్టు..

సినిమా థియేటర్లకు పదహారేళ్లలోపు పిల్లలు వెళ్లే సమయం వేళలపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు అప్పటి వరకు 16 ఏళ్లలోపు పిల్లల్ని రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు థియేటర్లకు అనుమతించవద్దని హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ నిర్వహించారు..

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం..!

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో అక్రమ వలసదారులను తరిమేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ట్రంప్ తన వేటను మొదలు పెట్టాడు. పెద్దెత్తున ఇల్లీగల్ ఇమిగ్రేట్లను అరెస్టు చేస్తూ.. వారి దేశాలకు సంకెళ్లు వేసి మరీ ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు ట్రంప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొలంబియా అధ్యక్షుడు అమెరికా సర్కార్ తీరుపై తిరగబడ్డాడు. మా దేశస్తులను సంకెళ్లు వేసి ప్రత్యేక విమానంలో పంపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. అమెరికా నుంచి వలసదారులతో వెళ్లిన రెండు సైనిక విమానాలను ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కొలంబియా తీరుపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఆ దేశం నుంచి పంపే వస్తువులపై సుంకాలు పెంచుతామని, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంతో కొలంబియా వెనక్కి తగ్గి విమానాలకు అనుమతిచ్చింది. మరోవైపు అమెరికాలోని ఇండియన్స్ ఉండే రాష్ట్రాల్లోనూ, చర్చ్ లు, స్కూళ్లలో, గురుద్వారాల్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు..న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోని గురుద్వారాల్లో యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్), ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్మెంట్ (ఐసీఈ), కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) సంస్థల అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లోని గురుద్వారాలు సిక్కు వేర్పాటువాదులకు, అక్రమ వలసదారులకు అడ్డాలుగా మారిపోయినందుకే తనిఖీలు చేపుడుతున్నామని అమెరికా అధికారులు తెలిపారు. అయితే, గురుద్వారాల్లోకి సాయుధ అధికారులు, భద్రతా సిబ్బంది ప్రవేశించడంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం చర్యలు గురుద్వారాల పవిత్రతను, సిక్కుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (SALDF) ప్రకటించింది..