సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభం..!

*సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభం*

శ్రీకాకుళం :

అర‌స‌వ‌ల్లి శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామి ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లలు సూర్య నమస్కారాలతో ప్రారంభంమైంది

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ, సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సుమారు 5000 మందితో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది.

జిల్లా యోగా గురువు రామారావు అధ్యక్షతన సూర్య నమస్కారాలు జరిగాయి. 12 రకాల ఆసనాలు వివరిస్తూ అందరితో చేయించారు. అనంతరం గురువు మాట్లాడుతూ సూర్య నమస్కారం యొక్క రెగ్యులర్ అభ్యాసం మెరుగైన మానసిక స్పష్టత, మెరుగైన ఏకాగ్రతకు దారితీస్తుంది, మెరుగైన ఉత్పాదకత, పనితీరును అనుమతిస్తుందన్నారు. సూర్య నమస్కారాలు కేవలం భౌతిక సాధన కాదు మనస్సు-శరీర అవగాహనను కూడా పెంపొందించుకోడానికి దోహద పడతాయన్నారు. పన్నెండు యోగా ఆసనాలను మిళితం చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో చేయడం మంచిదన్నారు.

ఈ కార్య‌క్రమంలో వివిధ జిల్లా అధికారులు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, యోగా శిక్షకులు జిల్లాలో వివిధ యోగ సంఘా సభ్యులు పతంజలి యోగ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సూర్య ప్రణవ పతాంజలి యోగ, ఓం శాంతి, వాకర్స్ క్లబ్ సభ్యులు, పలు ఎన్జీవో సభ్యులు తదితరుల పాల్గొన్నారు.