వసంత పంచమి.. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు
వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణీసంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఈరోజు(సోమవారం) ఒక్కరోజే 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మౌనీ అమావాస్య రోజు తొక్కిసలాట దృష్ట్యా యూపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది.
పెరుగుతున్న భక్తుల రద్దీ
వసంత పంచమి కన్నా ముందే మహాకుంభమేళాకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 90 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. దీంతో జాతర ప్రారంభమైన జనవరి 13 నుంచి ఇప్పటి వరకు మహాకుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 33.61 కోట్లకు చేరింది. మరోవైపు మహా కుంభ్లో జరిగిన తొక్కిసలాట తర్వాత ప్రయాగ్రాజ్లోని హోటళ్ల బుకింగ్లు బాగా తగ్గాయి. దీంతో వసంత పంచమి నేపథ్యంలో తమకు మళ్లీ బుకింగ్స్ పెరుగుతాయని హోటళ్ల యజమానులు ఆశిస్తున్నారు.