లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

..

*దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ.. ఎక్కడంటే?*

భారత దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు కాబోతుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో.. ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైనట్టు ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి ఆశిష్ షేలర్ వెల్లడించారు. ఐటీశాఖ నేతృత్వంలో.. ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, ఎల్అండ్ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఉన్నట్లు తెలిపారు..

ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది

ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైంది.

ఢిల్లీ ఇలా అవడానికి కారణం ఎవరు?? పదేళ్లు ఎవరు పరిపాలించారు??

అదే పదేళ్లు డబల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉండి ఉంటే వాషింగ్టన్ ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేది.. – ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో 50 వేల కోళ్లు వైరస్ కారణంగా మృత్యువాత.!..

*చికెన్ ప్రియులు జర జాగ్రత్త……అంతుచిక్కని వైరస్‌తో భారీగా చనిపోతున్న కోళ్లు*

అంతుచిక్కని వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా కోళ్లు చనిపోతున్నాయి.

ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో 50 వేల కోళ్లు వైరస్ కారణంగా మృత్యువాత పడ్డాయి.

కల్లూరుతో పాటు యజ్ఞనారాయణపురం, వెన్నవల్లి, నారాయణపురం, తదితర ప్రాంతాలలో నిర్వాహకులు భారీగా నష్టపోయారు.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 1.20 కోట్ల కోళ్లు చనిపోయాయి.

తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోళ్ల పరిశ్రమ యజమానులు కోరుతున్నారు..

*దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ.. ఎక్కడంటే?*

భారత దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు కాబోతుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో.. ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైనట్టు ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి ఆశిష్ షేలర్ వెల్లడించారు. ఐటీశాఖ నేతృత్వంలో.. ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, ఎల్అండ్ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఉన్నట్లు తెలిపారు.

*స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన*

ఈనెల 15లోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది

గ్రామ నాయకులు, కార్యకర్తలు అలర్ట్‌గా ఉండండి – వైరా కార్యకర్తల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఐటిసి టూ డీల్లీ చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయితీ.

దీపాదాస్ మున్షి వ‌ద్ద‌కు చేరిన వ్య‌వ‌హ‌రం..

ఐటిసి లో మీటింగ్ త‌ర్వాత ఎమ్మెల్యేల‌కు పిసిసి పోన్

ఎక్క‌డ మాట్ల‌డోద్దు అంటూ ఆదేశాలు ..అయిన కూడ మీడియాలో మాట్ల‌డిన ఎమ్మెల్యేలు

ఇప్పుడు ఇష్యూ పై పోక‌స్ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రాల ఇంచార్జ్ దీపాదాస్

ఎమ్మెల్యేల‌కు పోన్..ఎక్క‌డ మాట్ల‌డోద్దు అంటూ ఆదేశాలు

తాను 5 న రాష్ట్రానికి వ‌స్తాన‌న్న దీపాదాస్

మొన్న రీవ్యూలో ఈ అంశాన్ని ప్ర‌స్త‌వించిన సీఎం

ఎమ్మెల్యేల‌కు , జిల్లా ఇంచార్జ్ మినిస్ట‌ర్ల‌కు గ్యాప్ ఉండోద్దు అన్న సీఎం..

నేటి నుంచి 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకారం

నామినేషన్ల స్వీకారానికి ఈ నెల 10 చివరి తేదీ

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్న అధికారులు

ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు

రేపు ప్రత్యేక అసెంబ్లీ సందర్భంగా నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు..

పెళ్లిలో డాన్స్ చేసిన వరుడు.. అది నచ్చక పెళ్లి కాన్సల్ చేసిన మామ..

ఢిల్లీలో ఒక పెళ్లిలో ఆసక్తికర ఘటన జరిగింది…

ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చోలీకే పీఛే క్యాహై పాటకు డాన్స్ చేశాడు..

ఇది కాబోయే మామకు నచ్చలేదు. అలాంటి వాడికి బిడ్డను ఇచ్చేది లేదంటూ పెళ్లిని కాన్సల్ చేశాడు..

వరుడు వివరిస్తున్నా వినకుండా ఆడపెళ్ళివారు మండపం నుంచి వెళ్లిపోయారు..

*వసంత పంచమి.. భక్తజనసంద్రంగా మహాకుంభమేళ*

*20 రోజుల్లో 33 కోట్ల మంది పుణ్య స్నానానికి తరలివచ్చారు*

ప్రయాగ్ రాజ్ :

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్జ్ మహాకుంభ మేళలో భక్తజనసంద్రంగా మారింది. నేడు వసంత పంచమి సందర్భంగా చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 17 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని సమాచారం. కాగా, వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా.

ప్రయాగ్జ్ మహా కుంభమేళాకు భారీగా భక్తుల పోటెత్తారు. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 1 వరకు సుమారు 33కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. వసంత పంచమి పురస్కరించుకొని సోమవారం నాడు 4 నుంచి 6కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో
మరోసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

జేబు దొంగ నుండి కోట్లకు పడగెత్తిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ ప్రభాకర్

చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ప్రభాకర్ 8వ తరగతిలోనే చదువు ఆపేసి దొంగతనాలు మొదలెట్టాడు

రూ.3000 దొంగతనంతో మొదలైన అతని క్రిమినల్ ప్రయాణం కోట్లకు చేరింది

విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలలో ఉండటం, అమ్మాయిలతో డేటింగ్, స్నేహితుల పేర్లతో రిజిస్టర్ చేయించి హై-ఎండ్ కార్లను వాడడం చేశాడు.. నార్సింగిలోని అతని ఫ్లాట్‌లో ₹50,000 విలువైన మద్యం, జిమ్ సెటప్ మరియు ఖరీదైన గాడ్జెట్‌లు ఉన్నాయి.

ప్రభాకర్‌పై ఐదు రాష్ట్రాల్లో 80+ పైగా కేసులు ఉన్నాయి.. ఇంతటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ప్రిజం పబ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు

అతని వద్ద నుంచి 4 తుపాకీలు, 450 బులెట్లు స్వాధీనం చేసుకున్నారు

ప్రిజం పబ్ వద్ద కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్ దొంగ ప్రభాకర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది….

*పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు*

గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని వేసిన మొదటి పిటిషన్‌తో పాటు రెండో పిటిషన్‌ను విచారిస్తానన్న సుప్రీంకోర్టు

ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణ జరిగే రోజే రెండో పిటిషన్‌పై విచారణ చేస్తామంటూ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.

నాకు పద్మ భూషణ్ కాదు… నాన్నకు (Sr NTR ) భారత్ రత్న రావాలి.

నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు.

కేంద్ర ప్రభుత్వం మొన్న నాకు పద్మభూషణ్ అవార్డు కంటే… నాన్నకు భారతరత్న అవార్డు రావాలని కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆకాంక్ష….

కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని నందమూరి బాలకృష్ణ ఆశాభవం

ఆయనకు భారతరత్న అవార్డు తెలుగు ప్రజలు తెలుగు జాతీయ సాధిస్తుందని నా ధీమా….