ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!

*🔹ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం*

సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్..

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌..

ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు..

ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలు..

ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.56 కోట్ల మంది..

3 వేల సమస్యాత్మక పోలింగ్ బూత్‌లు గుర్తింపు…

ఎన్నికల విధుల్లో 35 వేల మంది పోలీసులు ..

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ..

ఈ నెల 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు..

బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ..

అవాంఛనీయ ఘటనలు జరగకుండా..
ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు..

సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. వీరికి సౌకర్యంగా 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు క్రమశిక్షణతో ఓటు హక్కును వినియోగించుకుంటుండగా, పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించబడ్డాయి…