*టీటీడీ సంచలన నిర్ణయం.. అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు*
ఆంద్రప్రదేశ్ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
TTDలో మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది.
బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయు అయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్,లెక్చరర్లు, తదితరులు ఉన్నారు..
*ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ*
స్పీకర్ కార్యాలయం నోటీసులతో దానం నాగేందర్ ఇంట్లో సమావేశం
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశం
లీగల్ గా ముందుకు వెళ్లే అంశంపై చర్చలు
అసెంబ్లీ సెక్రటరీకి, సుప్రీం కోర్టుకు సమాధానం ఇచ్చే అంశంపై చర్చ
డిల్లీకి వెళ్ళే ఆలోచనలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు..
*అనకాపల్లి జిల్లాలో విష వాయువు లీక్.*
అనకాపల్లి జిల్లాలో విష వాయువులు లీక్ కావడం మరోసారి కలకలం రేపింది. నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కంపెనీలో విష వాయువు లీక్ అయింది. యూనిట్ 9లోని విషవాయువు లీకై సుమారు 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటన సమయంలో 20 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది..
*అమెరికాలో కొనసాగుతున్న బహిష్కరణ ఆపరేషన్.. వలసదారులతో భారత్ బయలుదేరిన విమానం*
మరికొన్ని గంటల్లో విమానం భారత్ చేరుకునే అవకాశం
విమానంలో ఎంతమంది ఉన్నారన్న విషయంలో అస్పష్టత
అమెరికాలో అక్రమంగా 7.25 లక్షల మంది భారతీయులు
అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తామన్న భారత్
భారత్కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం అమెరికా నుంచి బయలుదేరింది. మరికొన్ని గంటల్లో ఇది భారత్ చేరుకునే అవకాశం ఉంది. అయితే, ఇందులో ఎంతమంది ఉన్నారన్న వివరాలు తెలియరాలేదు. అన్నట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వివిధ దేశాలకు చెందిన వారిని బహిష్కరిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తిస్తున్న అధికారులు వారిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు. అందులో భాగంగా భారత్కు ఓ విమానం బయలుదేరింది. సీ17 విమానంలో వీరిని తరలిస్తున్నట్టు సమాచారం.
ట్రంప్ అధ్యక్షుడయ్యాక తొలుత 538 మందిని అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించారు. అలాగే, ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉంటున్న దాదాపు 5 వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు ఒక్కో వ్యక్తిపై అమెరికా దాదాపు 4,675 డాలర్లు ఖర్చు చేస్తోంది.
కాగా, అమెరికాలో భారత్కు చెందిన దాదాపు 7.25 లక్షల మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉంటున్నట్టు సమాచారం. వీరిలో 18 వేల మందిని భారత్కు తరలించేందుకు జాబితా రూపొందించింది. ఈ విషయంలో భారత్ కూడా తమ స్పందనను తెలియజేసింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా అమెరికా సహా ఎక్కడ ఉన్నా భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపింది. కాగా, మెక్సికో, సాల్వెడార్ తర్వాత అమెరికాలో ఎక్కువగా ఉంటున్నది భారతీయులే…
Actress Pushpalatha: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..
టాలీవుడ్ సీనియర్ నటి పుష్పలత (87) చైన్నైలో కన్నుమూశారు.
టీ.నగర్ లోని తిరుమల పిళ్లై రోడ్డులో నివాసం ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు పుష్పలత.
1958లో విడుదలైన సెంగోట్టై సింగం అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు పుష్పలత. ఆ తర్వాత 1961లో కొంగునాట్టు తంగం అనే సినిమాలో కథానాయికగా కనిపించారు. నానుమ్ ఒరు పెణ్ అనే సినిమాలో నటుడు ఏవీఎం రాజన్ కు జోడిగా నటించారు.
యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం వంటి చిత్రాల్లో నటించారు. ఏవీఎం సంస్థ నిర్మించిన రాము సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషలలోనూ నటించారు పుష్పలత.
1963లో మైన్ భీ లక్కీ హూన్ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నర్స్ అనే మలయాళ సినిమాలోనూ నటించారు. సకలకళా వల్లభన్, నాన్ అడిమై ఇల్లై వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు.
డ్రగ్స్ మరియు లైంగిక వేధింపుల కేసులో గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్త కుమారుడి అరెస్ట్..
యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. యువతులు, వివాహితలకు డ్రగ్స్ ఇచ్చి, లైంగికవాంఛ తీర్చుకుంటూ వీడియోలను చిత్రీకరిస్తున్నాడని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య(32) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి ఠాణాలో కేసు నమోదైంది. దాదాపు 80 నగ్న వీడియోలు, ఫొటోలున్న ఓ హార్డిస్కును సైతం ఆమె పోలీసులకు అందజేశారు. దాంతో సోమవారం మస్తాన్ సాయితోపాటు యూట్యూబర్ ఖాజాను అరెస్టు చేశారు. మస్తాన్సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడు..
మస్తాన్ దర్గా కు చెందిన ఇతను ముందుగా డ్రగ్స్ అలవాటు నుంచి బయట పడేయమని ఆ దర్గాలో మొక్కుకోవాలి..
ఆ దర్గాకు దండం పెట్టుకుంటే వీళ్ళ ఇళ్లలోనే మంచి జరగనప్పుడు ఆ దర్గాకు వెళ్తే మంచి జరుగుతుందని భావించడం పెద్ద చెత్త..మూఢ నమ్మకం..
కుంభమేళాలో చనిపోతే మోక్షం.. బిహార్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
ఉత్తర్ప్రదేశ్ (Uttar PradesH) రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ (Prayagraj) వేదికగా జరుగుతోన్న కుంభమేళాలో చనిపోతే మోక్షం లభిస్తోందని బిహార్ (Bihar) స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ (MP Pappu Yadav) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయిన వారికి మోక్షం లభిస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. త్రివేణి సంగమం (Triveni Sangam) ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అనధికారిక లెక్కల ప్రకారం సుమారు 600 మంది వరకు చనిపోయారని ఆయన ఆరోపించారు. కనీసం వారికి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh) అంత్యక్రియలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారు మోక్షం పొందారని ఒక బాబా చెప్పారని.. సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath)ను ఉదేశించి పప్పు యాదవ్ కామెంట్ చేశారు.
కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela)లో గత నెల 30 తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mouni Amavasya) సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. మౌని అమావాస్య (Mouni Amavasya)ను పురస్కరించుకుని పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్లోని (Prayagraj) త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సెక్టార్-2 ప్రాంతంలో భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మృతి కుంభమేళాలో చనిపోతే మోక్షం.. కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలుచెందిన బాధిత కుటుంబాలకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
ఖర్గే ఆవేశంలో బీజేపీ ఎంపీపై నేను మీ తండ్రి సహచరుడిని.. మీరు నాకు చెప్పేదేంటి.. నోరు మూసుకుని కూర్చోండి...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహంతో కంట్రోల్ తప్పారు..ఖర్గే ఆవేశంలో బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. నేను మీ తండ్రి సహచరుడిని.. మీరు నాకు చెప్పేదేంటి.. నోరు మూసుకుని కూర్చోండి అంటూ కౌంటరిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై, సహనం కోల్పోయిన ఖర్గే.. ఆయనపై విరుచుకుపడ్డారు. అనంతరం, ఖర్గే మాట్లాడుతూ..’నేను మీ తండ్రి సహచరుడిని. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?. నేను నిన్ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. నోరు మూసుకుని కూర్చో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఖర్గే వ్యాఖ్యల కారణంగా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కల్పించుకున్నారు. ఇరు వర్గాలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి గురించి తన ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఖర్గేకు సూచించారు. అలాగే, చంద్రశేఖర్ ఎంతో ప్రజాదరణ కలిగిన నేత అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నీరజ్ శేఖర్ 2019లో బీజేపీలో చేరారు. ఆయన తండ్రి చంద్ర శేఖర్ దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన సోషలిస్ట్ నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు. చంద్ర శేఖర్.. అక్టోబర్ 1990 నుండి జూన్ 1991 వరకు ఆరు నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు..
తీన్మార్ మల్లన్నపై సీతక్క ఫైర్
TG: కులగణనపై విమర్శలు చేస్తున్న MLC తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క ఫైరయ్యారు. కులగణన నివేదికకు నిప్పు పెట్టడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్లో ఉన్నారో లేదో ఆయన డిసైడ్ చేసుకోవాలని సూచించారు. ఆయన గెలుపు కోసం తాము తీవ్రంగా కష్టపడినట్లు చెప్పారు. BRS నేతలు తలసాని, పద్మారావు కులగణన సర్వేలో ఎందుకు పాల్గొనలేదని ఆమె ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదని ఆమె స్పష్టం చేశారు..
*🔹లక్షల డప్పులు.. వేయి గొంతులు వాయిదా..మంద కృష్ణ మాదిగ:*
_ఫిబ్రవరి 7న తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతులు సాంస్కృతిక ప్రదర్శనకు అనుమతి నిరాకరించడం శోచనీయం. ప్రభుత్వం, సీఎం ఉద్దేశ్య పూర్వకంగా అనుమతి నిరాకరణ. ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవడం లేదు…. ప్రదర్శనను వాయిదా వేస్తున్నాం:_