ఎమ్మెల్యేల అనర్హత కేసు….ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపు 10 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కీలక వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది..
తెలంగాణలో (Telangana) ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం కోర్టులో (Supreme Court) సోమవారం జరిగిన విచారణ వాయిదా పడింది..
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు..పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వారు ఈ పిటిషన్ పెట్టారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్కు గురి చేయొద్దని, ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయని తెలిపింది. ఎమ్మెల్యేలు పార్టీలు మారి 10 నెలలు అయింది.. ఇది రీజనబుల్ టైం కాదా అంటూ సుప్రీం కోర్ట్ ప్రశ్నించగా.. మాకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజుల సమయం కావాలని కోరారు రోహిత్గి. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బిఆర్ఎస్ వాదిస్తుంది. రీజనబుల్ టైమ్ అంటే ఎంత సమయం కావాలో చెప్పండని కోర్టు లేవనెత్తింది. అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, ఈ పిటిషన్పై విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది..