ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బండ్ల గణేష్ ప్రచారం కూడా నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంత ఇంత కాదు.
ఫలితాల సమయంలో తనదైనశైలిలో బీఆర్ఎస్ పార్టీపై ట్వీట్లు చేశారాయన. బండ్ల గణేష్ పవన్ కల్యాణ్కు వీర భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ నటించిన తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కుకున్నారు.
నా సినిమాలకు కోసం నేను ఎవరినైనా పొగుడుతానని .. అందరి హీరోలు నాకు సమానమే అని ఆయన చెప్పుకొచ్చారు. పైగా ఏపీలో జగన్గారి పాలన బాగుందని..నాకు తెలిసిన వ్యక్తికి వైద్య సాయం చేశారని.. ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తి దేవుడుతో సమానమని చెప్పి జగన్ సర్కార్ మీద ప్రశంసలు కురిపించారు.