కాళ్లు మొక్కుతా.. భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు.
కరీంనగర్ – శంకరపట్నం మండలం తాడికల్ శివారులో రోడ్డు విస్తరణలో కోల్పోయిన తన భూమికి పరిహారం ఇవ్వాలంటూ తహసీల్దార్ భాస్కర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు వెంగళ శ్రీనివాస్
రహదారి పనులకు అడ్డొస్తున్నాడని రైతు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు…
శ్రీశైలం రిజర్వాయర్ నుండి ఆంధ్రకు నీరు..
శ్రీశైలం రిజర్వాయర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాలువ నుండి యదేచ్చగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోతున్న నీరు.
9 ఏండ్లు మేము చంద్రబాబును అడుగు కూడా పెట్టనివ్వలేదు.. ఒక్కసారి వస్తే తన్ని పంపించేసాము..మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి....
నాగార్జున సాగర్ మా చేతిలో ఉన్నంత కాలం మా ఇష్టానుసారంగా నీళ్లు వదిలాము.
మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మోడీకి, చంద్రబాబుకు తల వంచి.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అన్నారు.
నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు. కొత్త బోర్లు వేసి నష్టపోకండి….
యాసంగి పంటలు వెయ్యకండి. వేసి నష్టపోకండి, అప్పుల పాలు అవ్వకండి.
భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చింది..
వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు ..
మాసబ్ ట్యాంక్, శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఘటన
అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చిన అపార్ట్మెంట్ వాసులు
లిఫ్టులో ఇరుక్కున్న బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది..
ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు..
కూతురు పెళ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి..
భిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బాలచంద్రం గుండెపోటుతో మృతి……..
మధ్యాహ్నం జంగంపల్లి శివారులోని బి టి ఎస్ వద్ద గల ఇంద్రప్రస్థ ఫాంహౌస్ లో తన కూతురు కనకమహాలక్ష్మి పెళ్లిలో కుప్పకూలిన బాల్ చంద్రం………
కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన బలచంద్రం……..
సిగరేట్లు తాగేవారికి షాక్.. భారీగా పెరగనున్న ధరలు..
బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులను అందించింది. దీనివల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు స్వల్పంగా తగ్గుతాయని భావిస్తున్నారు. అదేవిధంగా, పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ వచ్చే ఏడాదితో ముగుస్తుంది.
గతంలో 25% GST తగ్గించినప్పటికీ.. ప్రస్తుతం 40 శాతానికి పెంచే ఉద్దేశ్యం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వాలు ఆదాయ కొరతను ఎదుర్కొన్నప్పుడు లేదా ఎక్కువ ఆదాయం అవసరమైనప్పుడు, వారు మొదట చూసేది ధూమపానం చేసేవారిని, మద్యపానం చేసేవారిని.
పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ వచ్చే ఏడాదితో ముగుస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా తగ్గవచ్చు. దీనిని భర్తీ చేయడానికి, ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై GSTని పెంచబోతోంది. ఇలా జీఎస్టీ పెంచినట్లయితే సిగరేట్ల ధర భారీగా పెరిగే అవకాశం ఉంది.
మానవ ఆరోగ్యానికి హానికరమైన పొగాకు, మద్యం ఉత్పత్తులను ప్రమాదకరమైన వస్తువులుగా పరిగణిస్తారు. ఈ వస్తువులపై ఎక్కువ పన్ను విధిస్తారు. దీని వలన ప్రజలు వాటిని కొనకుండా నిరుత్సాహపడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం, సిగరెట్లపై 75 శాతం పన్ను విధించాలి..
*ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యం*
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
*ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత*
నారాయణపేట: అన్నిరంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేటలో ఇవాళ(శుక్రవారం) మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని తమ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణ స్థానిక ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, మంత్రులు సీతక్క, శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరైన ఈ పర్యటన కార్యక్రమానికి ఇన్చార్జిగా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ వ్యవహరించారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. 600 ఆర్టీసీ బస్సులకూ మహిళలను యజమానులను చేశామని గుర్తుచేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చామన్నారు. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నామని ప్రకటించారు. సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
పాఠశాలలపై ప్రత్యేక దృష్టి..
రూరల్, అర్బన్ అనే తేడా లేదు.. తెలంగాణలో మహిళలంతా ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుందామని తెలిపారు. మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నిధులు తాము ఇస్తాం.. నిర్వహణ మీరు చేయాలని అన్నారు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు..
సిగరెట్లపై GST 40 శాతానికి పెంపు?
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై GSTని 40శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఉత్పత్తులపై GST ప్రస్తుతం 28శాతం ఉంది. దీంతోపాటు కాంపెన్సేషన్ సెస్, ఇతర చార్జీలు కలిపి 53శాతం దాకా అవుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న కాంపెన్సేషన్ సెస్ గడువు 2026 మార్చి 31తో ముగుస్తుంది. అయినప్పటికీ మొత్తం పన్నుపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు GSTని పెంచాలని భావిస్తోంది.
యాదగిరి గుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్ కి ఆహ్వానం..
అనంతరం జరిగే యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా.. పూజారుల ఆహ్వానం..
• నాటి కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి.. ఈనెల 23 న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరి గుట్ట పునర్నిర్మాణ కర్త, బి ఆర్ ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారిని ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
అనంతరం…మార్చి నెల 1 నుంచి 11 వ తారీఖు వరకు జరిగే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ ని కోరారు.
ఈ మేరకు యాదగిరి గుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారులతో కూడిన బృందం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రాలతో కేసీఆర్ కు ఆశీర్వచనం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీ ఈ ఓ భాస్కర్, ముఖ్య అర్చకులు నరసింహ మూర్తి, కిరణ్ కుమారాచార్యులు, పి ఆర్ ఓ రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
*గ్రూపు-2 మెయిన్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు*
▪️175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు.
▪️23న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ – 1.
▪️మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్-2
▪️100 మీటర్ల పరిధిలో 144 నిషేధాజ్ఞలు.
▪️వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు.
▪️ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్.
ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న ఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై గురువారం రాష్ట్ర సచి వాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఎ. అనురాధతో కలిసి ఆయన అధికారులతో సమీక్షిం చారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 13 పాత జిల్లా కేంద్రాల్లోని 175 కేంద్రా ల్లో ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మార్గదర్శకాలను జిల్లాలకు పంపండం జరిగిందని వాటిని పూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు 92,250 మం ది అభ్యర్థులు హాజరు. కానున్నారని తెలిపారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబం ధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు…