ఆ ఎనిమిది మందిని సురక్షితంగా రక్షించుకునెందుకు.., ఎన్డీఆర్ఎఫ్ బృందాలు!… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…
ఎస్.ఎల్.బి.సి టన్నెల్.లో……
సంఘటన జరగడం దురదృష్టకరం………..
ఆ ఎనిమిది మందిని సురక్షితంగా రక్షించుకునెందుకు భారత సైన్యం సహకారం తీసుకుంటాం……………
రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంది………..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,సి.ఎస్ తో రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా నిర్ణయం తీసుకుని రిస్క్యూ టీం లను రప్పిస్తున్నాం…………
విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నాం…………..
అగ్నిమాపక&విపత్తు నిర్వహణ డి.జీ ఆధ్వర్యంలో రిస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి…………
అవసరమైన వైద్య సేవల కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాం……
ఐ. జీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టారు………….
నీటిపారుదల శాఖా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు…..
రంగంలోకీ దిగిన సింగరేణి రిస్క్యూ టీంలు……..
ఈ రాత్రికి ఘటనా స్థలికి చేరుకోనున్న ఆర్మీ రిస్క్యూ టీం……….
టన్నెల్ లో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు కాపాడే రిస్క్యూ టీంలు ఇక్కడికి రానున్నాయి……..
లోపట బాగంలో వెంటిలేషన్ కు ఇబ్బంది లేదు……..
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం………
ప్రపంచంలోనే టన్నెల్ తవ్వకంలో రాబిన్ సంస్థ పేరెన్నికగలది……….
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ లో
ఈ తరహా సంఘటన చోటు చేసుకోవడం……… దురదృష్టకరమని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు………
శనివారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్.ఎల్.బి.సి టన్నెల్ తవ్వకాలలో ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు………….
సంఘటనా స్థలిని పరిశీలించడంతో పాటు లోపట చిక్కుకున్న వారిని కాపాడడం కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు గాను దోమలపెంటలోని జే. పి గెస్ట్ హౌస్ లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి తెలంగాణా అగ్నిమాపక,రిస్క్యూ టీం డి. జి నారాయణ రావు,ఐ. జి సత్యనారాయణ నాగర్ కర్నూల్ కలెక్టర్ తో పాటు రాబిన్ సంస్థ కు చెందిన లెన్ మైనార్డ్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు………
అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి పని చేస్తుందన్నారు……
అందు కోసం ఇప్పటికే సింగరేణి కి చెందిన రిస్క్యూ టీం లు రంగంలోకి దిగాయని ,భారత ఆర్మీ కి చెందిన రిస్క్యూ టీం లతో తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడామని ఈ రాత్రి వరకు ఆ టీం ఇక్కడికి చేరుకుంటుందని ఆయన వెల్లడించారు…….
అంతే గాకుండా టన్నెల్ వద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు రంగంలోకి దిగి కాపాడే టీంలతో కుడా మాట్లాడినట్లు ఆయన తెలిపారు……..
ఈ మధ్య కాలంలో ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నప్పుడు రంగంలోకి దిగి ప్రాణాపాయం లేకుండా కాపాడిన టీం ను కుడా రంగంలోకి దింప నున్నట్లు ఆయన తెలిపారు………….
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లతో పాటు ఉన్నత స్థాయి ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాను ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు……
అగ్నిమాపక డి.జి నారాయణ రావు ఆధ్వర్యంలో రీస్క్యూ టీం పనిచేస్తుండగా ఐ. జి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయాన్నారు……
ఇప్పటికే వైద్య బృందం అంబులెన్స్ లను సిద్దంగా ఉంచామన్నారు………
నీటిపారుదల శాఖాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారిని కాపాడేందుకు చేపడుతున్న చర్యలను పర్యవేక్షిస్తున్నామన్నారు
అయితే వెంటిలేషన్ కు ఇబ్బంది లేదన్నారు. టన్నెల్ తవ్వకంలో రాబిన్ సంస్థ ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్నదన్నారు……..
లోపట చిక్కుకున్న ఆ ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడడమే ప్రభుత్వం ముందున్న సవాల్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు…….
ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిలో ప్రాజెక్ట్ ఇంజినీర్,సైట్ ఇంజినీర్ తో పాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు వర్కర్లు ఉన్నారని ఆయన వివరించారు……..
గల్లంతయినవారి వివరాలు ఇలా ఉన్నాయి………..
1..మనోజ్ కుమార్ (PE) ఉత్తర ప్రదేశ్
2.. శ్రీనివాస్ (FE) ఉత్తర ప్రదేశ్
3.. సందీప్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
4.. జటాక్స్ (కార్మికుడు)జార్ఖండ్
5..సంతోష్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
6.. అనూజ్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
7..సన్నీ సింగ్ (కార్మికుడు)జమ్మూ కాశ్మీర్
8.. గురుప్రీత్ సింగ్ (కార్మికుడు)పంజాబ్…….
టన్నెల్ తవ్వకాలు మొదలు పెట్టిన ఏజెన్సీ నిర్వాహకులు చెప్పే కథనం ప్రకారం అకస్మాత్తుగా లోపటికి నీరు,మట్టి 8 కిలోమీటర్ల మేర రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని భావించాల్సి ఉందన్నారు……
రోజువారీగా పని మొదలు పెట్టినట్లే ఈ ఉదయం 8 గంటలకు పని మొదలు పెట్టిన 30 నిమిషాలలోనే ఈ సంఘటన ఉత్పన్నమౌడంతో వెంటనే నిర్వాహకులు పనిని నిలిపి వేసి బయటకు రావడంతో పాటు వీలున్నంత వరకు సిబ్బందిని బయటకు తీసుకొచ్చారన్నారు……….
ఏదైతే టన్నెల్ బోర్ మిషన్ T.B.M ,వద్ద పని మొదలు పెట్టారో అక్కడికి నీరు,మట్టి చేరుతుండడంతో పాటు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మిషన్ మీద ఉన్న వారు,వెనుక భాగంలో ఉన్న వారు బయటకు రాగలిగారని
మిషన్ ముందు భాగంలో ఉన్న వారు అందులో చిక్కుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.