శివ స్వాముల పై లాఠీఛార్జ్…!..ఎమ్మెల్యే రాజా సింగ్ అగ్రహం.బొట్టు పెట్టుకున్నారా లేదా అని చూసి కొనాలని ప్రకటనా….
ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ శైవక్షేత్రం అయిన శ్రీశైలానికి.. మహాశివరాత్రి (Mahashivratri) సందర్భంగా మా విరమన చేసేందుకు గానే పెద్ద మొత్తంలో శివ స్వాములు (Shiva swamulu) అక్కడికి చేరుకుంటున్న విషయం తెలిసిందే..అయితే నిన్న శివస్వాములతో దురుసుగా ప్రవర్తించిన ఓ శాప్ యజమాని(అన్యమతస్తుడు)ని శివ స్వాములు నిలదీశాడు. ఈ క్రమంలో మరోసారి స్వాములతో దురుసుగా ప్రవర్తించడంతో అక్కడున్నవారంత అతని షాప్పై దాడి చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితులను అదుపు చేసేందుకు శివ స్వాముల పై లాఠీఛార్జ్ (lathi charge) చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మాలలో ఉన్న శివ స్వాములపై పోలీసులు లాఠీ ఛార్జ్ (lathi charge) చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) స్పందిస్తూ.. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలాన్ని అపవిత్రం చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ముస్లింలకు షాప్లు కేటాయించారని, శివస్వాములపై పోలీసుల లాఠీచార్జ్ సరికాదని అన్నారు. అలాగే పవిత్ర క్షేత్రాల (Sacred fields) వద్ద ముస్లింలకు ఆలయాల దగ్గర షాపులు కేటాయించొద్దని, సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan)కు విజ్ఞప్తి చేస్తున్నానని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు. అంతకు ముందు.. పవిత్ర మహాశివరాత్రి (Holy Mahashivratri) సందర్భంగా.. ఉపవాసం ఉండే హిందువులు.. కచ్చితంగా హిందువుల వద్దనే పూలు, పండ్లు, దండలు కొనాలని.. పూజ సామగ్ర కొనేముందు.. అమ్మె వ్యక్తులు బొట్టు పెట్టుకున్నారా లేదా అని చూసి కొనాలని పిలుపునిచ్చారు…ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.