*సూర్యాపేట జిల్లా..*
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని గాజుల మల్కాపురం, చిన్న గారకుంట తండాలో ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
ఎండిన పొలాలను చూసి కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
జగదీష్ రెడ్డి రాకతో తరలివచ్చిన వందలాది మంది రైతులు..
ఎండిన పొలాల్లో గొర్రెలు, పశువులకు మెతగా ఇచ్చామని విలపించిన రైతులు..
కేసీఆర్ పాలనలో మీరున్నప్పుడు ఒక్క ఎకరం ఎండలేదని రైతుల ఆవేదన..
పుష్కలంగా నీళ్లతో మడికట్లలో చేపలు కూడా పట్టుకున్నామని.. నేడు ఎండిపోలాలను మళ్ళీ చూడాల్సిన దుస్థితి..
మీరే ఏమన్నా చేయాలని జగదీష్ రెడ్డి ని వేడుకున్న రైతులతో పాటు, పెద్దఎత్తున గిరిజన మహిళలు..
మరోచోట పొట్టదశ లో ఉన్న పోలాన్ని పండిచేందుకు వాటర్ ట్యాంకర్ తో నీళ్లు పెడుతున్న రైతు..
చూసి చలించిపోయిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
మీ హయాంలో నీరు, కరెంట్ కష్టాలు లేకుండా ధీమాగా పంటలు పండించుకున్నామన్న రైతు..
దింపుడుగల్లం ఆశగా ట్యాంకర్ నీళ్లు పెదత్తుకున్నాం సర్ అంటూ ఆవేదన..
ఎండిన పంటలు చూసి కంటతడి..
అప్పులు తీర్చాల్సిన పంటలను.. పశువులను మేపాల్సిన దుస్థితి..
రైతన్నల గోసలకు చలించి.. కంటతడి పెట్టుకున్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
*జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.*
పంటలను ఎండబెట్టి కాంగ్రెస్.. రైతుల ఉసురు తీస్తుంది..
ఇచ్చేందుకు నీళ్లున్నా.. ఇసుక వ్యాపారానికి పంటలు ఎండబెడుతున్నారు..
కృష్ణా, గోదావరి
ఆయకట్టులో పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపమే..
ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసీ నష్టపోయామని రైతులు కన్నీళ్ళు పెడుతున్నారు..
గోదావరిలో 10 వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం రైతులను ఎండబెడుతున్నారు..
ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ ఆన్ చేస్తే పంటలన్నీ పండుతాయి..
కాళేశ్వరం మా చేతికి ఇస్తే కేవలం మూడు రోజుల్లో చివరి ఎకరం వరకు నీళ్ళు పారిస్తామని సవాల్..
ఎక్కడ కేసీఆర్ కి పేరొస్తుందోనని రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్…
బీ ఆర్ ఎస్ హయాంలో ప్రతి ఎకరానికి నిరందించాం…
కాంగ్రెస్ ఇసుక వ్యాపార దాహానికి రైతులు నష్టపోతున్నారు..
ఇప్పటికైనా ఉత్తమ్ కళ్ళు తెరిచి ఉన్న పంటలనైనా కాపాడాలని డిమాండ్..
పంటలు ఎండి గత్యంతరం లేక గొర్ల, పశువులకు మేతకు అమ్ముకుంటున్నరని ఆవేదన..
సమైక్యాంధ్రలో జరిగినట్టు ఇప్పుడు మళ్ళీ రైతులు నష్టపోతున్నారు..
పేరుకే నీళ్ళు ఇస్తున్నామని చెబుతున్నా ఎక్కడా పొలాలకు అందడంలేదు..
నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ మేత కోసం గొర్లను పంపుతున్నాడని రైతులంటున్నారు..
ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా రైతులకు సాగు నీరివ్వండి.. రైతులను చంపకండి..