మంచు విష్ణు కన్నప్ప టీజర్ రిలీజ్…!.

కన్నప్ప సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. కన్నప్ప సినిమా నుంచి టీజర్ వచ్చేసింది. టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. అయితే.. తాజాగా కన్నప్ప సినిమా నుంచి టీజర్ వచ్చేసింది.

https://youtu.be/wKBP9dFxFBc?si=0aSN3_YHO5HrEgww

మంచు విష్ణు సవాల్‌..,.

మంచు విష్ణుకు చెందిన గూడెంపై శత్రువులు ఎటాక్ చేసినట్లుగా టీజర్‌లో చూపించారు. వాళ్లు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి తేల్చుకుందాం అంటూ మంచు విష్ణు సవాల్ చేసినట్లుగా టీజర్‌లో చూపించారు. ఆపద వచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవతనా అంటూ మంచు విష్ణు చెప్పగానే అక్షయ్‌కుమార్ టీజర్‌లో కనిపించాడు. పరవమశివుడిగా గెటప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. టీజర్ చివరలో ప్రభాస్‌ను పవర్‌ఫుల్ లుక్‌లో చూపించారు. ప్రభాస్ కనిపించే సీన్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.

వంద కోట్ల బడ్జెట్‌…

కన్నప్ప మూవీలో టైటిల్ పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. అతడికెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా కన్నప్ప తెరకెక్కుతోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.బడ్జెట్‌ను మాత్రం మేకర్స్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

మోహన్‌బాబు ప్రొడ్యూసర్‌…

మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్‌లాల్‌, అక్షయ్ కుమార్‌, కాజల్ అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు. మైథలాజికల్ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. కన్నప్ప సినిమాను మోహన్‌బాబు ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. రెమ్యునరేషన్ లేకుండా ప్రభాస్ ఈ సినిమాలో ఫ్రీగా నటించినట్లు సమాచారం.

మహాభారత్ సీరియల్‌…

కన్నప్ప మూవీలో శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖేష్ కుమార్ గతంలో మహాభారత్ సీరియల్‌కు దర్శకత్వం వహించాడు.

వివాదాలతోనే…

మంచు విష్ణు హిట్టు అందుకొని చాలా కాలమైంది. కన్నప్పపైనే అతడు బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కాగా కొన్నాళ్లుగా సినిమాల కంటే సోదరుడు మంచు మనోజ్‌తో వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్నాడు మంచు విష్ణు… గతంలో మంచు విష్ణు పై ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ప్రభాస్ ఎంట్రీ తో అదుర్స్ అనిపిస్తుంది..

Also post see..
https://www.youtube.com/live/5jV_bUaeFrM?si=BUr9sdZxIpEMWLG-
*లైవ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి..*

*మేళ్లచెరువు మహిళ విభాగం ప్రో కబడ్డీ లైవ్ ..*