ప్లేయర్లు, ఐపీఎల్ ఆడడానికి ఇండియాకి వస్తారు. అయితే భారత ప్లేయర్లు, ఐపీఎల్ తప్ప ఫారిన్ లీగుల్లో పాల్గొనడానికి వీల్లేదు. భారత దేశవాళీ టోర్నీల్లో ఇండియన్ ప్లేయర్లు ఆడాలనే ఉద్దేశంతో ఫారిన్ లీగుల్లో పాల్గొనడంపై నిషేధం విధించింది భారత క్రికెట్ బోర్డు.ఒకవేళ ఏ ప్లేయర్ అయినా ఈ రూల్ అతిక్రమించి, ఫారిన్ లీగుల్లో ఆడితే వాళ్లకు ఐపీఎల్ ఆడేందుకు అవకాశం ఉండదు..
‘ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కాసేపు మరిచిపోదాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ప్లేయర్లు, ఐపీఎల్లో ఆడతారు. కానీ భారత ప్లేయర్లు మాత్రం మిగిలిన లీగ్స్‌లో ఆడరు. కాబట్టి ప్రతీ క్రికెట్ బోర్డు కూడా తమ ప్లేయర్లను ఐపీఎల్‌కి పంపడం మానేయాలి.. భారత్, తమ ప్లేయర్లను మిగిలిన లీగుల్లో ఆడేందుకు పంపించనప్పుడు, మీరు మాత్రం ఎందుకు ప్లేయర్లను పంపిస్తున్నారు. దీనిపైన అన్ని బోర్డులు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలి..’ అంటూ వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్..
ఐపీఎల్ 2008 సీజన్లో పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నారు. అయితే అదే ఏడాది జరిగిన ఉగ్రదాడి కారణంగా ఇండియా – పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ ప్లేయర్లు, ఐపీఎల్లో ఆడడంపై నిషేధం విధించింది బీసీసీఐ.. ఐపీఎల్‌కి పోటీగా పాక్ సూపర్ లీగ్‌ని తీసుకొచ్చింది పీసీబీ. అయితే ఐపీఎల్‌కి పీఎస్ఎల్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. ఐపీఎల్లో ఒక్కో ప్లేయర్‌కి రూ.27 కోట్ల వరకూ ధర పలుకుతూ ఉంటే, పాక్ లీగ్‌లో ప్లేయర్ల శాలరీలు అందులో 10 శాతం కూడా లేవు..
ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ వరుస పరాజయాలతో గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది. న్యూజిలాండ్, టీమిండియాతో మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్.. వరుసగా మూడు ఐసీసీ టోర్నల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పాకిస్తాన్ క్రికెట్ గురించి పట్టించుకోకుండా ఐపీఎల్‌పై ఆక్రోశం చూపించి.. మ్యాటర్‌ని సైడ్ ట్రాక్ పట్టించాలని ఇంజమామ్ ఉల్ హక్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్….
మగాళ్లైతే పాకిస్థాన్ వచ్చి ఆడండి.. టీమిండియాకు సవాల్ ?..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమితో పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు, ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. అంతేకాకుండా భారత జట్టుపై వారి అక్కస్సును వెళ్లగక్కుతున్నారు. ఈ టోర్నీలో భారత జట్టు తన మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడుతుంది. ఇప్పటికే లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు.. రెండింటిలోనూ విజయం సాధించి సెమీ ఫైనల్ కి వెళ్ళింది. సెమీ ఫైనల్ లోను విజయం సాధిస్తే మార్చ్ 9న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లో ఆడుతుంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, మాజీ క్రికెటర్లు భారత జట్టుపై రగిలిపోతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ భారత్ కి సవాల్ విసిరాడు. ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ” భారత్ నిజంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి పాకిస్తాన్ తో మూడు ఫార్మాట్ లలో 30 మ్యాచ్ లు ఆడాలి. 10 టెస్టులు, 10 వన్డేలు, 10 టి-20 లు ఆడాలి. అప్పుడే ఏది గొప్ప జట్టు అనేది తెలుస్తుంది.
ఇదే జరిగితే భారత జట్టుకు, ప్రపంచ క్రికెట్ కు మేము తగిన సమాదానం చెప్పిన వాళ్ళం అవుతాం” అని సవాల్ విసిరాడు. మరోవైపు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా భారత్ పై తన అక్కసును వెలగక్కాడు. అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు, ఆయా జట్ల ఆటగాళ్లకు భారత్ కి వ్యతిరేకంగా విజ్ఞప్తి చేశాడు. “ప్రపంచంలోని ఆటగాళ్లంతా ఇండియాకి వెళ్లి ఐపీఎల్ ఆడతారు. భారత ఆటగాళ్లు మాత్రం మరే ఇతర లీగ్ లలో ఆడరు.
Also Read: Champions Trophy 2025: టీమిండియా దరిద్రం..వరల్డ్ కప్ 2023 రిపీట్ కాబోతుందా ?
ఈ క్రమంలో అన్ని క్రికెట్ బోర్డులు మీ మీ జట్ల ఆటగాళ్లు ఐపిఎల్ లో ఆడకుండా నిరోధించాలి” అంటూ ఐపిఎల్, బిసిసిఐపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్తాన్ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేవారు. కానీ ముంబైలో జరిగిన ఉగ్రదాడి తరువాత పాకిస్తానీ ఆటగాళ్లను ఐపిఎల్ లో ఆడకుండా నిషేధించారు. ఇలా పాకిస్తాన్ ఆటగాళ్లు భారత జట్టుపై చేస్తున్న విమర్శలు క్రికెట్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మీ జట్టుకు సరిగ్గా ఆడడం చేతకాక.. ఇలా ఇండియా పై పడి ఏడవడం ఏంటని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు.