నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ వేడుకలు ప్రారంభం
BSF ఆధ్వర్యంలో నిర్వహించే బీటింగ్ రిట్రీట్ వేడుకలు పంజాబ్లోని 3 పాకిస్థాన్ బార్డర్ చెకోపోస్టుల్లో నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. అటారీ- వాఘా, హుస్సేన్వాలా, సడ్కీ చెకోపోస్టుల్లో ఇవాళ సా.6 గం.కు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈరోజు కేవలం జర్నలిస్టులకు మాత్రమే అనుమతుంది. సాధారణ పౌరులకు రేపటి నుంచి వేడుకలు చూసేందుకు అవకాశం కల్పించనున్నారు. పహల్గామ్ దాడి తర్వాత ఈ వేడుకలు ఆపేసిన విషయం తెలిసిందే.