తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీంతో రాష్ట్రంలోని అటవీ కవచం 7 శాతం పెరిగిందని వివరించారు..దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, హరితహారం పేరుతో నాటిన మొక్కల్లో ఆరోగ్యానికి హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తికి ముప్పుగా మారుతాయని, పైగా అవి పక్షులకు కూడా సహజ వాతావరణాన్ని అందించలేవని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ చెట్లు కొద్ది మాత్రమే నాటినట్లు సమర్థించగా, స్పీకర్ పెద్ద ఎత్తున నాటినట్లు స్పష్టం చేశారు. హైవేలు, డివైడర్లు సహా అనేక ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయని, కాబట్టి వీటిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.