టెస్ట్ క్రికెట్ లో చరిత్ర సృష్టించిన టీమిండియా..

భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య డొమినిక వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మూడో ఆట ప్రారంభ‌మైంది. భార‌త్ ఓవ‌ర్ నైట్ స్కోరు 312/2 బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తోంది. క్రీజులో య‌శ‌స్వి జైస్వాల్ (143), విరాట్ కోహ్లి(36) ఉన్నారు. వెస్టిండీస్‌పై ప్ర‌స్తుతం టీమ్ఇండియా 162 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది…

ఓపెన‌ర్‌గా వ‌చ్చిన జైశ్వాల్ మూడో రోజు జేస‌న్ హోల్డ‌ర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 360 బంతుల్లో 150 ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు…
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. 91 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగని ఘనత భారత జట్టు చేసింది. 1932లో టీమిండియా తన తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. 1932 నుంచి ఇప్పటి వరకు, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఎటువంటి వికెట్ కోల్పోకుండా ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం చాటలేకపోయింది. అయితే వెస్టిండీస్‌పై టీమిండియా చరిత్ర సృష్టించింది.