రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు బడ్జెట్లో పైసా నిధులు కూడా కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరును నిరసిస్తూ మునుగోడు మండలం కొరటికల్లులో కొబ్బరి పీచు తింటూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వినూత్న నిరసన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే బడ్జెట్ ను సవరించి వికలాంగుల సంక్షేమానికి 3000 కోట్లు కేటాయించాలని డిమాండ్..
రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు బుధవారం మునుగోడు మండలం కొరటికల్లులో బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి పైసా కూడా నిధులు కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరును నిరసిస్తూ సంఘం నేతలతో కలిసి కొబ్బరి పీసు తింటూ వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతు దుర్భర జీవితాలు గడుపుతుంటే రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టడుగున ఉన్న వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయకుండా ప్రజా పాలన పేరుతో సంబరాలు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తీరు దురదృష్టకరమని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ 6000 కు పెంచుతామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టానికి సమర్థవంతంగా అమలు చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగించడంతోపాటు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించి వికలాంగుల సమాజం యొక్క ఓట్లను కొల్లగొట్టి వికలాంగుల ఓట్లతో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన నాటి పిసిసి అధ్యక్షుడు నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజం యొక్క సమస్యల పరిష్కరించేందుకు కృషి చేయకుండా వికలాంగుల సమాజంపై అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తు బడ్జెట్లో వికలాంగుల సమాజానికి పైసా నిధులు కేటాయించని తీరు తమ వికలాంగుల సమాజాన్ని ఎంతో ఆవేదనకు గురిచేసిందని ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లనే నేటికీ ఇస్తూ పెన్షన్ల పెంపునకు కృషి చేయకపోవడంతో వికలాంగుల సమాజం చాలీచాలని పింఛన్లతో జీవనం గడపలేక రాష్ట్రంలో కోబ్బరి పీసులు తినే పరిస్థితి దాపురించిందని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేచ్చేందుకు వెంటనే ముందుకు రావాలని ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజస్థాన్ చతిస్గడ్ తమిళనాడు రాష్ట్రాల తరహాలోని తెలంగాణ వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వేలాదిమంది వికలాంగులతో అసెంబ్లీని ముట్టడిస్తామని వెల్లడించారు సంఘం మునుగోడు మండల అధ్యక్షులు తలారి సహదేవుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి సంగం మునుగోడు మండల ఉపాధ్యక్షులు ఓంటేపాక ముత్తయ్య సంఘం చింతపల్లి మండలం అధ్యక్షులు నర్రావుల నరేందర్ సంఘం చండూరు మండలం అధ్యక్షులు ఆకారపు వెంకన్న సంఘం జిల్లా మహిళా నాయకురాలు గుండెబోయిన అలివేలు సంఘం చండూరు మండలం మహిళా అధ్యక్షురాలు కారింగ్ రేణుక చండూరు మండల ఉపాధ్యక్షులు పల్లె గోని రవి సంగం మున సంఘం ఉపాధ్యక్షులు ఒంటెపాక ముత్తయ్య సంగం చండూరు మండలం యూత్ అధ్యక్షులు బొమ్మర గోని శ్రీకాంత్ సంఘం కొరటికల్ గ్రామ శాఖ నూతన అధ్యక్షులు రొమ్ముల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.