హైకోర్టుకు చేరిన నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం..!

నల్లగొండ జిల్లా..

*🔹హైకోర్టుకు చేరిన నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం..*

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి..

తన డిబార్ ను రద్దుచేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు..

నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన ఝాన్సీ లక్ష్మి టెన్త్ పేపర్ లీకేజీలో వ్యవహారంలో డిబార్ చేసిన విషయం తెలిసిందే..

విద్యాశాఖ సెక్రటరీ,బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రెటరీ,నల్గొండ డీఈవో, ఎంఈఓ, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ ప్రతివాదులుగా పేర్కొన్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి..

ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ..