ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ గెలుపు ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడిన లఖ్‌నవూ సన్‌రైజర్స్‌పై నెగ్గింది.
IPL 2025: Pooran, Shardul star as LSG kill SRH-hype, conquer Hyderabad fortress.
ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 5వికెట్ల తేడాతో నెగ్గింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ 16.1 ఓవర్లలోనే ఛేదించింది. నికోలస్ పూరన్ (70 పరుగులు, 26 బంతుల్లో; 4×6, 6×6) సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోగా, మిచెల్ మార్ష్ (52 పరుగులు) ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్ 2, అడమ్ జంపా, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.
పూరన్ విధ్వంసం..
191 పరుగుల లక్ష్య ఛేదనలో లఖ్‌నవూకు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎయిడెన్ మర్క్రమ్ (1)ను షమీ ఔట్ చేశాడు. కానీ, వన్ డౌన్లో దిగిన పూరన్ వచ్చీ రావడంతోనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి దెబ్బకు 6 ఓవర్లలోనే లఖ్‌నవూ 77 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్లోనే పూరన్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఫిఫ్టీ తర్వాత కూడా పూరన్ అదే జోరు చూపించాడు. 8.4 ఓవర్ వద్ద కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు…
ఆకాశమే హద్దుగా.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సొంత మైదానంలో ఘోర పరాభవం. బ్యాటుతో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు ఈసారి చేతులెత్తేశారు. ట్రావిస్ హెడ్(47), అనికిత్ వర్మ(36)ల పోరాటంతో 190 పరుగులు చేసింది హైదరాబాద్. ఛేదనలో తన తొలి ఓవర్లోనే మహ్మద్ షమీ డేంజరస్ ఎడెన్ మర్క్రమ్(1)ను వెనక్కి పంపి బ్రేక్ ఇచ్చాడు. మిడాఫ్ దిశగా మర్క్రమ్ ఆడిన బంతిని అక్కడే కాచుకొని ఉన్న కమిన్స్ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 4 పరుగుల వద్ద లక్నో మొదటి వికెట్ పడినా మిచెల్ మార్ష్(52), నికోలస్ పూరన్(70)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు..