*వనస్థలిపురం కమ్మగూడలో భూ వివాదం..!*
భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు
బస్సుల అద్దాలు ధ్వంసం, పలు బైకులకు నిప్పు పెట్టిన ప్లాట్ ఓనర్లు.. కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో వివాదం
మేము గత 20 సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్స్, ఇల్లు నిర్మించుకుని ఉంటున్న ప్రాంతం మాదంటూ భూకబ్జాదారులు వచ్చి గత కొద్ది రోజులుగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్లాట్స్ యజమానులు
ఈ రోజు ఉదయం మెహదీపట్నం నుండి మహిళలను బస్సులలో తెచ్చి బెదిరించడానికి పాల్పడుతుండగా అడ్డుకున్న ప్లాట్ల యజమానులు.. కబ్జాదారులను తరిమి వేసి వారికి చెందిన బైకులు తగలబెట్టి, మహిళలు వచ్చిన బస్సు అద్దాలు ధ్వంసం చేసిన ప్లాట్ల యజమానులు…