ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు..ys షర్మిల..

వైఎస్ భారతికి మద్దతుగా రంగంలోకి దిగిన షర్మిల..

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కూటమి సర్కారు సోషల్ మీడియా మీద స్పెషల్గా ఫోకస్ పెట్టింది. పార్టీలకు అతీతంగా మహిళల్ని ఎవరైన ట్రోలింగ్ చేస్తే, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేసింది. దీనిలో భాగంగా.. ఇప్పటికే సోషల్ మీడియా ట్రోలర్స్, పోస్ట్ లు పెట్టేవారిపై ఏపీ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.ఈ క్రయంలో తాజాగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై.. టీడీపీకి చెందిన కార్యకర్త.. చేబ్రోలు కిరణ్ నీచంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అంటూ ఆగ్రహించారు. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే అని ఆగ్రహించారు.

కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ,టీడీపీలే అని ఆగ్రహించారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారన్నారు ys షర్మిల. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారని నిప్పులు చెరిగారు.