కర్రెగుట్టలపై భద్రతా బలగాల బాంబుల వర్షం…38మంది మావోయిస్టులు మృతి …!!?

*📢Breaking News:-*

*🔹కర్రెగుట్టలపై భద్రతా బలగాల బాంబుల వర్షం.*

*• మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ…*

_• ఆ ప్రాంతంలో భారీగా మోహరించిన బలగాలు…_

*• 38మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.*

_• మృతుల సంఖ్య పెరిగే అవకాశం.._

*• కొనసాగుతున్న కాల్పులు..

తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ (Karreguttalu Encounter) జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందారు. ప్రస్తుతం కర్రెగుట్టల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. కర్రెగుట్టలే టార్గెట్‌గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతాబలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక మావోయిస్టులకు పెట్టని కోటలాగా కర్రెగుట్టలు ప్రాంతం ఉంది..