పాక్ నేవీ విన్యాసాలు.. భారత్ ను పరోక్ష కవ్వింపు చర్యలు.!

పాక్ నేవీ విన్యాసాలు.. భారత్కు పరోక్ష వార్నింగ్!

భారత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ కరాచీ సమీపంలోకి చేరుకున్న నేపథ్యంలో పాక్ పరోక్ష హెచ్చరికలు చేసింది. అరేబియా సముద్రంలో ఈరోజు, రేపు తమ నౌకాదళం విన్యాసాలు చేయనుందని, వీటిలో క్షిపణి పరీక్షలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ సమయంలో నౌకలు, విమానాలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని ఓ నోటిఫికేషన్లో తెలిపింది. అటు ఏ మిషన్కైనా నౌకలు సిద్ధంగా ఉన్నాయంటూ భారత నేవీ పోస్ట్ వేయడం గమనార్హం.