“చైత్ర అమావాస్య”
హిందూ సంప్రదాయంలో ప్రతి తిథికీ ప్రాధాన్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథులకు మరింత విశిష్టత ఉంటుంది. అయితే ఈ అమావాస్యతో చైత్ర మాసం ముగిసి వైశాఖ రానుంది. కాబట్టి దీనిని చైత్ర అమావాస్య అంటారు. అందులోనూ ఈ అమావాస్య #ఆదివారం వచ్చింది. కాబట్టి ఈరోజు కొన్ని విధివిధానాలు పాటిస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.
చైత్ర అమావాస్య ఆదివారం రావడం చాలా విశేషం ఎందుకంటే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజున ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా అది కొన్ని వేల రెట్ల విశేషమైన ఫలితాలను అందిస్తుంది. చైత్ర అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి, ఇలా చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి లేదా కృష్ణుడి విగ్రహం ఉన్నవారు అమావాస్యతో కూడిన ఆదివారం రోజు దక్షిణావృత శంఖంలో గంగాజలం లేదా మూమూలు నీటిని పోయాలి. అనంతరం ఆ శంఖంలోని నీటితో విగ్రహానికి అభిషేకం చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
చైత్ర అమావాస్య రోజు గంగాస్నానం చేస్తే చాలా మంచిది. అయితే గంగా స్నానం చేయలేని వారు దానికి ప్రత్యామ్నయంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కలిపి గంగా అనుకుంటూ స్నానం చేసినా గంగా స్నానం చేసి ఫలితం కలుగుతుంది.
అమావాస్య రోజు ఓ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి, దానిని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెలుగుతూ ఉండేలా చూడాలి, ఆ దీపం ఎలా వెలిగించాలంటే, ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లోని హాల్లో ఈశాన్యం మూలలో ఓ పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యప్పిండితో ముగ్గు వేయాలి. అనంతరం ఆ ముగ్గు మధ్యలో పెద్ద మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం చైత్ర అమావాస్య రోజు సూర్యాస్తమయం వరకు వెలుగుతూనే ఉండాలని అంటున్నారు. ఇలా సాయంత్రం వరకూ వెలుగుతూనే ఉండటం వల్ల సంవత్సరం మొత్తం తిరుగులేని అదృష్టం కలిసి వస్తుంది.
ఈ అమావాస్య రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. సాయంత్రం రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని, ఫలితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది…
తులసి కోట దగ్గర దీపం: చైత్ర అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలని మాచిరాజు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని వివరిస్తున్నారు.
అభిషేకం: ఇంట్లో విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి లేదా కృష్ణుడి విగ్రహం ఉన్నవారు అమావాస్యతో కూడిన ఆదివారం రోజు దక్షిణావృత శంఖంలో గంగాజలం లేదా మూమూలు నీటిని పోయాలి. అనంతరం ఆ శంఖంలోని నీటితో విగ్రహానికి అభిషేకం చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు..
గంగా స్నానం: చైత్ర అమావాస్య రోజు గంగాస్నానం చేస్తే చాలా మంచిదని పౌరాణిక గంథ్రాలు తెలియజేస్తున్నట్లు మాచిరాజు చెబుతున్నారు. అయితే గంగా స్నానం చేయలేని వారు దానికి ప్రత్యామ్నయంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కలిపి గంగా అనుకుంటూ స్నానం చేసినా గంగా స్నానం చేసి ఫలితం కలుగుతుందని అంటున్నారు.
ప్రత్యేకమైన దీపం:ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఓ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి, దానిని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెలుగుతూ ఉండేలా చూడాలని మాచిరాజు చెబుతున్నారు. ఆ దీపం ఎలా వెలిగించాలంటే, ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లోని హాల్లో ఈశాన్యం మూలలో ఓ పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యప్పిండితో ముగ్గు వేయాలి. అనంతరం ఆ ముగ్గు మధ్యలో పెద్ద మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం చైత్ర అమావాస్య రోజు సూర్యాస్తమయం వరకు వెలుగుతూనే ఉండాలని అంటున్నారు. ఇలా సాయంత్రం వరకూ వెలుగుతూనే ఉండటం వల్ల సంవత్సరం మొత్తం తిరుగులేని అదృష్టం కలిసి వస్తుందని వివరిస్తున్నారు..
రావి చెట్టు దగ్గర: అమావాస్య రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలని చెబుతున్నారు. సాయంత్రం రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని, ఫలితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు..
ఇంట్లో పూజ: చైత్ర అమావాస్య రోజు ఉదయం స్నానం చేసి పూజా మందిరంలో కుందులలో ఆవు నెయ్యి పోసి ఎర్ర వత్తులతో దీపం వెలిగించి, ఆ దీపంలో 2 లవంగాలు, కుంకుమపువ్వు పొడి కలపాలి. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం లభించి గృహయోగం కలుగుతుందని, శత్రుబాధలు, దిష్టి దోషం పోయి ధనలాభం కలుగుతుందని చెబుతున్నారు.
గోసేవ: ఈ చైత్ర అమావాస్య రోజున గోసేవ చేయడం అంటే గోవుల చుట్టూ ప్రదక్షిణలు, ఆహారం పెట్టడం, నీటిని తాగించడం వంటివి చేసినా మంచిదంటున్నారు. అలాగై మూగజీవాలకు ఆహారం పెట్టినా మంచి జరుగుతుందని వివరిస్తున్నారు.
ప్రత్యేకమైన దానాలు: ఈ అమావాస్య రోజు నీటికుండను లేదా తెల్లటి వస్త్రాలను దానం ఇచ్చినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు…
ధూపం: చైత్ర అమావాస్య రోజు ఇంట్లో ధూపం వేస్తే సంవత్సం మొత్తం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, దిష్టి మొత్తం పోతుందని మాచిరాజు చెబుతున్నారు. అందుకోసం ఆవుపేడతో చేసిన పిడకలను తీసుకుని దాని మీద ఆవు నెయ్యి కొద్దిగా వేసి బెల్లం పొడి చల్లి సాంబ్రాణి ఉంచి ధూపం వెయ్యాలంటున్నారు. దీన్నే గుడ ధూపం అంటారని చెబుతున్నారు.