తనపై, కేసీఆర్ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ. ఎమ్మెల్సీ కవిత వార్నింగ్..!

శనివారం ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family)పై సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం తీవ్రవాదులకు తక్కువేమి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం (Kaleshwaram)లో అవినీతి జరిగిందని చెబుతూ.. ఏం ముఖం పెట్టుకొని సభ పెడుతున్నారో కేటీఆర్ (KTR) చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎంపీ అరవింద్ మాటలకు కౌంటర్ గా కవిత సంచలన వీడియోను పోస్ట్ చేశారు. గతంలో ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు సమాధానంగా.. తనపై, కేసీఆర్ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ.. వార్నింగ్ ఇచ్చిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై ఆమె.. రెండు సార్లు ఎంపీ అయ్యి ప్రజలకి, రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకొచ్చింది లేదు కానీ ప్రతిసారి కేసీఆర్ కుటుంబం మీద వ్యక్తిగథ దూషణ బాగా అలవాటు అయ్యిందని మండిపడ్డారు. అలాగే చిల్లర మాటలు ఇట్లనే మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొట్టడం మాత్రం కాయం అని కవిత రాసుకొచ్చారు.