కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదు ..కేసీఆర్..

ఊరూరా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు, కార్యకర్తలు ఓరుగల్లు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులతో ఎల్కతుర్తి కూడలి గులాబీమయంగా మారింది. సభ కోసం 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ ఏర్పాట్లు జరిగాయి. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేశారు. 500 మంది నేతలు కూర్చునేలా గులాబీ రంగులతో బాహుబలి వేదికను తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు నాలుగు వేలకు పైగా ఆర్టీసీ బస్సులతో సహా మొత్తం 50 వేల వాహనాల్లో జనం బీఆర్ఎస్ సభకు హాజరయ్యారు. లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ప్రాంగణం గులాబీ మయంగా మారింది.

తెలంగాణ నినాదానికి తిరిగి జోవం పోసింది ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు…
ప్ర‌జ‌లు ప‌రిపాల‌న అప్ప‌గిస్తే విధ్వంస‌మైన తెలంగాణ‌ను వికాసం వైపు న‌డిపించాను. కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఆశ్ర‌య‌మిస్తే.. ఏప్రిల్ 27, 2001న జ‌ల‌దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చ‌రిత్ర‌ను మలుపుతిప్పిన మ‌హోజ్వ‌ల‌ ఘ‌ట్టం. కులం, మ‌తం, ప‌ద‌వుల కోసం పుట్ట‌లేదు.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. ప‌ద‌వీ త్యాగాల‌తోనే మ‌న తెలంగాణ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. అది ఫ‌లించి సొంత రాష్ట్ర క‌ల కూడా నెర‌వేరింది. చీక‌ట్ల‌ను పార‌దోల‌డానిక ప్ర‌జ‌ల్లో ఆత్మ‌విశ్వాసం పెంపొందించ‌డానికి ఒక మాట చెప్పాను. ఉద్య‌మం నుంచి వెన‌క్కి మ‌ళ్లితే, ఉద్య‌మ జెండాను దించితే రాళ్ల‌తో కొట్టి చంపాండ‌ని అని చెప్పి ఉద్య‌మాన్ని ప్రారంభించాను. ఆ త‌న‌ద‌నంత‌రం జ‌రిగిన పంచాయతీ ఎన్నిక‌ల్లో, సిద్ధిపేట ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప్రాణం పోసి ఊపిరిలూదితే అద్భుతంగా ఉద్య‌మం పురోగ‌మించింది. 60 ఏండ్ల స‌మైక్య పాల‌న‌లో ఎంతో వేద‌న, హింస, అణిచివేత చూశాం.. అంద‌రికీ బాగా తెలుసు. గోదావ‌రి, కృష్ణా నీళ్లు ద‌క్క‌క‌కుండా త‌ర‌లిపోతే త‌ల్లి చ‌నుబాల‌కు నోచ‌ని పిల్ల‌లాగా తెలంగాణ బిడ్డ‌లు రోదించారు. కురువు, కాట‌కాల‌కు గుర‌య్యారు. పాములు, తేళ్లు కుట్టి అనాథాల్లాగా చ‌నిపోయారు అని కేసీఆర్ తెలిపారు….కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదని కేసీఆర్ చెప్పారు. వలసవాదుల వల్ల నలిగిపోతున్న తన భూమికి విముక్తి కల్పించాలని భావించానని, తెలంగాణకు విముక్తి కలిగిచేందుకు ఒక్కడినే బయలుదేరానని తెలిపారు. అప్పట్లో తన గరించి కొందరు వెటకారంగా మాట్లాడారని అన్నారు..ఆనాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని కేసీఆర్ చెప్పారు. మన నడిగడ్డలో అసెంబ్లీలో నిలబడి చంద్రబాబు నాయుడు తెలంగాణ పదాన్ని నిషేధించారని తెలిపారు.

అలాగే, నాడైనా, నేడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని కేసీఆర్ అన్నారు. అనేక మంది బలిదానాలు, త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని చెప్పారు.

తెలంగాణను 1956లో బలవంతంగా ఆంధ్రతో జవహర్‌లార్‌ నెహ్రూ కలిపారని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశంగా అణిచివేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత మలిదశ ఉద్యమం ఉద్ధృతమైందని తెలిపారు…

తెలంగాణ ఆనాడు హైదరాబాద్ పేరుతో ఉన్నప్పుడు ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలాన్ని గుర్తించి తెలంగాణ ఇస్తామని నమ్మించి తమ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ తెలంగాణ ఇవ్వకుండా 14 ఏళ్లు సతాయించిందని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ జయ శంకర్ తో కలిసి దేశంలోని మిగతా పార్టీలను ఒప్పించి కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధించుకున్నామన్నారు.

గతంలో ఏ పార్టీ ఆలోచించని విధంగా ఆలోచించి, ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే రైతు బంధు పథకం ఆరంభించాం. ఎన్నో పథకాలు ఎవ్వరూ అడగకుండానే, ఎన్నికల హామీల్లో చెప్పకుండానే ప్రజల సంక్షేమం కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం. కానీ ఇవాళ పరిస్థితి అలా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాదినర్థమైంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఏం మాయ రోగమొచ్చింది? ఎందుకు ఆ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ రేవంత్ రెడ్డి సర్కారుపై కేసీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు..