🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 29 – 04 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *విదియ* రా8.36 వరకు,
నక్షత్రం : *కృత్తిక* రా9.53 వరకు,
యోగం : *సౌభాగ్యం* సా6.48 వరకు,
కరణం : *బాలువ* ఉ9.47 వరకు,
తదుపరి *కౌలువ* రా8.36 వరకు,
వర్జ్యం : *ఉ10.40 – 12.10,*
దుర్ముహూర్తము : *ఉ8.10 – 9.01,*
మరల *రా10.48 – 11.34,*
అమృతకాలం : *రా7.39 – 9.08,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 5.40,
సూర్యాస్తమయం: 6.14,
*_నేటి మాట_*
*పురాణాలు వినడం వలన, శాస్త్రాలు చదవడం వలన, లాభం ఏమిటి.. ???*
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న మరియు అందరి మనసులో మెదిలే సంశయం ఇది…
మానవులు సంపాదించిన ధనము నకు నలుగురు వారసులు గలరు!!…
మొదటివాడు ధర్మము,
రెండవవాడు రాజు, అనగా ప్రభుత్వము.
మూడవవాడు అగ్ని,
నాలుగవవాడగు దొంగ …
ఇందులో పెద్ద వారసుడు ధర్మము.
పెద్ద వారసునిగా పెద్ద వాటా రావలసి యుండును.
దీనిని ప్రతీ వారు గుర్తించాలి,
ఈ నలుగురు వారసులపై అత్యున్నత మైనది త్యాగం,
ప్రియమైన వస్తువులు సైతం, నవ్వుతూ, ఎట్టి సంకోచము లేకుండా, ఇతరులకు ఇవ్వ కలిగినవాడు, నిజమైన త్యాగి.
కర్మ ఫలమును ఈశ్వరార్పణముగా వదలినవాడు త్యాగి కాగలడు…
మనస్సుకు శాంతి లేకపోతే దుఃఖములు మనలను వదలవు.
ఆత్మ శాంతి లేనివారికి ఎంత సంపద ఉన్ననూ ప్రయోజనం శూన్యమే!
మహనీయుల చరిత్ర లు, భౌతిక, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక శాస్త్ర ములు, ఎన్నియో ముఖ్య మైన గ్రంథములు, వినుటవలన, వలన, ఈజ్ఞానం మనిషిలో కలుగుతుంది.
నెమ్మదిగా అనుభవ జ్ఞానము కూడా పెంచుకోవాలి, లేకపోతే ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలితం శూన్యం,
ఆత్మ విచారణ అవసరం, తనకు తాను తెలుసుకోక, ప్రపంచాన్ని జయించడం కష్టం.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏