(World) ప్రపంచ స్పీడ్ బౌలర్ల కు చుక్కలు చూపించిన 14 ఏళ్ల కుర్రాడు..
వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. 35 బంతుల్లోనే మూడంకెల మార్కు అందుకున్నాడు. కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.
హేమాహేమీ బౌలర్లను సైతం చుక్కలు చూపించాడు.ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని కొట్టాడు. గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ లో అడుగుపెట్టిన వైభవ్ లక్నో సూపర్ జాయింట్స్తో తొలి మ్యాచ్ ఆడగా.. 20 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు.
అయితే.. ఆ మ్యాచ్లో స్టంపవుటయిన వైభవ్.. పెవిలియన్ చేరే సమయం లో ఏడ్చుకుంటూ వెళ్లటం అందరినీ కదిలించింది. కాగా.. ఈరోజు మాత్రం తన కసిని, సత్తానుచూపించా డు 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు వైభవ్ సూర్యవంశీ అదిరే ఆరంభం ఇచ్చాడు.
మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ లాంటి బౌలర్ల ను ఊచకోత కోశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన ఈ కురార్డు.. మరో 18 బంతుల్లో మరోసారి ఫిఫ్టీ మార్కు అందు కున్నాడు. దీంతో 35 బంతుల్లోనే సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్గా నిలిచాడు.
తన ఇన్నింగ్స్లో ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించు కున్నాడు. చివరకు 38 బంతుల్లో 101 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.నిజానికి వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనే చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల వయసులోనే సూర్యవంశీ వేలంలోకి వచ్చాడు.
అతడి ప్రతిభను మెచ్చిన ఫ్రాంఛైజీలు.. అతడి కోసం పోటీ పడ్డాయి. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు సొంతం చేసుకుంది. మేనేజ్మెంట్ అంచనాలను అందు కుంటూ అతడు సత్తా చాటాడు….. ఆ వయసుకి ఆ బ్యాటింగ్ కి సంబంధమే లేకుండా ఆడటం వైభవ్ సూర్యవంశీకే సాధ్యమైంది…