ఐకేపీ సెంటర్‌కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసి ముద్దవుతుందని రోడ్డుపై ధర్నాకు దిగిన రైతులు
ఐకేపీ సెంటర్‌కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని, ఐకేపీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని రైతుల ఆగ్రహం
వెంటనే తూకం వేసి వడ్లు కొనాలని డిమాండ్…
తన భూమిని పట్టా భూమిగా మార్చాలని యువకుడి వినూత్న నిరసన
చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిరసన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి గ్రామంలో తన భూమిని పట్టా భూమిగా మార్చాలని ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్న అధికారులు స్పందించడం లేదని భూమిలోని చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేసిన యువకుడు..
ఉగ్రదాడి.. కశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ లోయలోని 48 టూరిస్ట్ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం మూసేసింది. కశ్మీర్లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలుండగా, ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లోకి టూరిస్టులను అనుమతించట్లేదు. ఈ 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని ఓపెన్ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టూరిస్ట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించింది..
POKలో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్.. భారత్ గుర్తింపు
POKలో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను భారత్ గుర్తించింది. కోటాపలాన్ నార్త్ దగ్గర హిజ్బుల్ లాంచ్ ప్యాడ్‌కు కమాండర్‌గా సైఫుల్లా ఖలీద్ ఉన్నాడని అధికార వర్గాలు వెల్లడించాయి. తప్రాబీ క్యాంప్ దగ్గర లష్కరే తోయిబాకు చెందిన రెండో లాంచ్ ప్యాడ్ ఉన్నట్లు తెలిపాయి. మూడో లాంచ్ ప్యాడ్ వద్ద అన్ని సంస్థలకు చెందిన టెర్రరిస్టులు నివసిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఉగ్రమూకలను పాక్ మరోస్థానానికి తరలిస్తున్నట్టు చెప్పాయి…
ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని, అధికారులను లోపలేసి గ్రామ పంచాయతీకి తాళం వేసిన గ్రామస్థులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం కిష్టాపురం గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా.. భూములు, గవర్నమెంట్ జాబులు ఉన్న వారికి ఇచ్చారని అధికారులను లోపలేసి పంచాయితీ కార్యాలయానికి తాళం వేసిన గ్రామస్థులు….
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు చచ్చిపోతా
నల్గొండ జిల్లా చండూర్ మండలం నెర్మట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, అర్హులకు ఇల్లు ఇవ్వలేదని తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు పోయి ఏదైనా పోసుకొని చచ్చిపోతా అంటూ మహిళ ఆవేదన..
మంత్రి తుమ్మల పర్యటనలో అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆగ్రహం
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు తనకు చెప్పలేదని, తుమ్మల పర్యటన షెడ్యూల్ కూడా తనకు చెప్పలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..
తనకి తెలియకుండా ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారని, తన మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..
కేసీఆర్ సభతో పోల్చుకుంటున్నారా పిల్ల కాకులు.. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి….
..
మా సభలో పల్లీలు, ఐస్ క్రీంలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది వస్తారు కాంగ్రెస్ సభకు
ఒక్కడే నాయకుడు మాట్లాడి సభ పెట్టే దమ్ము ఉందా కాంగ్రెస్ నాయకులకు?..రేవంత్ రెడ్డి రండ కాకపోతే, మొగోడే అయితే ఇప్పటివరకు ఎన్ని వడ్లు కొన్నారో, ఎంత మంది రైతులకు డబ్బులు వేశారో, ఎంత వడ్లకు బోనస్ వేశారో సాయంత్రం వరకు చెప్పాలి
సాయంత్రం వరకు చెప్పకపోతే రేవంత్ రెడ్డిని రండ అనే పిలుస్తా..రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ తియ్యలేదని రేవంత్ రెడ్డికి దుఃఖం ఆగడం లేదు
నీ పార్టీ ఎమ్మెల్యేలకే నీ పేరు గుర్తుండడం లేదు.. మరి కేసీఆర్ ఎందుకు తీస్తడు నీ పేరు ఒకసారి ఆలోచించుకోవాలి..
APలో 16,347 పోస్టులతో DSCకి దరఖాస్తుల ప్రక్రియ.
APలో 16,347 పోస్టులతో DSCకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. SC, ST, BC, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40% మార్కులతోనే అప్లై చేసుకునేలా ఉత్తర్వులిచ్చింది. బీఈడీకి, టెట్‌కు డిగ్రీలో 40% మార్కుల అర్హత ఉండగా DSCకి 45% పెట్టడంపై అభ్యర్థులు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాల్సిందే..
విశాఖ – జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఘటనలో ట్విస్ట్
బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లి, అమ్మమ్మ
పోలీసుల విచారణకు భయపడి ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లి, అమ్మమ్మ
ఏప్రిల్ 25న గాలి సోకిందని జ్ఞానాపురం చర్చికి బాలికను తీసుకొచ్చిన తల్లి, అమ్మమ్మ
బాలిక పిచ్చి పట్టినట్లు కరుస్తుందని నోట్లో గుడ్డ కుక్కి, మూతికి బట్ట చుట్టిన తల్లి, అమ్మమ్మ
దీంతో ఊపిరి ఆడక బాలిక మృతి…
*🔹ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు*
ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని త్రివిధ దళాలతో జరిగిన భేటీలో వెల్లడించారు.
భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, పహల్గామ్ ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామని పేర్కొన్నారు.
ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైం, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని,,,, మోదీ వెల్లడించారు..
ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిసాస్టర్ ఇంకొకటి లేదు..మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…
ఆగమాగం పనులు చేపించి 8 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నీచపు ప్రభుత్వం మీది, 60 రోజులైనా ఇంతవరకు వాళ్ల శవాలు కూడా తీయడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం మీది
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్ద వాగు కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది, ఇంతకన్న డిసాస్టర్ ఏముంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ? అది అర్థం కావడం లేదు…