పాకిస్తాన్ జిందాబాద్ అంటూ గట్టిగా నినాదాలు ..ఆగ్రహించి ప్రాణాలు పోయేలా కొట్టిన స్థానికులు……

ఆ మరుక్షణమే అంతా కలిసి అతన్ని కొట్టి చంపేశారు. కర్నాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఇష్టమున్నట్లు కాల్పులు జరిపి ఎంతో మందికి కడుపుకోతను మిగిల్చారు. దీనిపై ఇప్పటికే భారత్ దాయాది పాక్ కు ముప్పుతిప్పలు పెడుతుంది. దేశంలోని ప్రజలంతా.. కేంద్రానికి తమ సంఘీభావం తెలియజేస్తున్నారు.

ఉగ్రమూకల పీచం అణచాలని ప్రధాని మోదీని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. 26 మంది అమాయకులు, హిందువులే టార్గెట్ గా చనిపోయిన ఇప్పటికి కొంత మంది నీచులు .. భారత్లో ఉంటూ దాయాదికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. దీనిపై భారతీయులంతా రగిలిపొతున్నారు..
మరణించిన వ్యక్తి శరీరంపై స్పష్టమైన గాయాలు లేకపోవడంతో పోలీసులు మొదట సహజ మరణంగా కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతడి అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తేలింది. దీంతో ఇది హత్య కేసుగా మారింది. దీపక్ కుమార్ అనే ప్రత్యక్ష సాక్షి వివరాల మేరకు సచిన్ అనే వ్యక్తి ముందుగా దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. మొత్తం 25 మంది ఈ దాడిలో పాల్గొనగా.. ఇప్పటివరకు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు..

కర్ణాటక (Karnataka) మంగళూరులోని కుడుపు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక భత్రా కల్లుర్తి ఆలయ సమీపంలో ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ (Cricket tournament) నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. సుమారు 100 మందికి పైగా మ్యాచ్ ఆడేందుకు వచ్చారు. ఈ టోర్నమెంట్‌ను చూసేందుకు చాలా మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. అయితే మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యాహ్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ఓ యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ గట్టిగా నినాదాలు (Pakistan Zindabad slogans) చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అలాంటి నినాదాలు చేయొద్దంటూ అతడితో గొడవకు దిగారు. ఈ క్రమంలో సచిన్ అనే వ్యక్తి ఆ యువకుడితో గొడవకు దిగాడు. తర్వాత మరికొంతమంది అతడితో జత కలిశారు. ఈ వాదన కాస్తా.. కాసేపటికి గొడవకు దారి తీసింది. అంతా కలిసి ఆ యువకుడిపై మూకుమ్మడిగా (Assault on youth) దాడి చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చాలా మంది అతడిపై బలంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు… ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉధృత నడవడంతో ఇలాంటి పనికిమాలిన నినాదాలతో క్రీడాకారుల ఆగ్రహానికి గురై దెబ్బలు తిని చనిపోవడం జరిగింది…. ఈ ఘటనపై ఎవరూ కూడా అయ్యో పాపం అని కూడా అనలేదు. ఎందుకంటే.. ఇటీవల తీవ్రవాదుల దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందంటూ ఆధారాలు బయటపడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికైనా ఆగ్రహాన్ని తెప్పించడం జరుగుతుందని అనుకుంటున్నా రు..

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడిలో అంతర్గత అవయవాలు దెబ్బతినడం వల్లే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడిలో సుమారు 25 మందికి పైగా పాల్గొన్నట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర రావు స్పందించారు. మృతుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వాడనే విషయం తెలియరాలేదని చెప్పారు. పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడం వల్లే అతడిపై దాడి జరిగిందన్నారు. ఇలా నినాదాలు చేస్తే పోలీసులకు సమాచారం అందించాలి గానీ.. ఇలా భౌతిక దాడులు చేయడం తగదనన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.