పాకిస్థాన్లో హైఅలర్ట్..
యుద్ధ భయంతో పాకిస్థాన్ అలర్ట్ అయింది. త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది. భారత్, పాక్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. గగనతలంలో ఎయిర్ఫోర్స్, సముద్ర మార్గాల్లో నేవీ విన్యాసాలు చేస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ నిన్న సరిహద్దుకు వెళ్లినట్లు తెలుస్తోంది. జవాన్లను ఉద్దేశించి అతడు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినట్లు సమాచారం. ఇటు మనదేశంలోని ఢిల్లీలోనూ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.