బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. అమెరికాకు వెళ్లనున్నారు. అది కూడా తన జీవితంగా మొట్టమొదటిసారి. అదేంటీ కేసీఆర్.. ఇంతవరకు అమెరికాకు పోలేదా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును, కేసీఆర్ ఇప్పటివరకు అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లలేదు. అంతే కాదు.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్.. చేపట్టిన విదేశీ పర్యటనలు కేవలం రెండే రెండు కావటం గమనార్హం. అందులో ఒకటి సింగాపూర్, రెండోది చైనా. అంతకు మించి కేసీఆర్.. తన జీవితకాలంలో దేశం దాటలేదు. కాగా.. ఇప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం.. అమెరికాకు వెళ్లనున్నట్టు సమాచారం అందుతోంది..
శుక్రవారం నానక్ రాంగూడలోని అమెరికన్ కాన్సులెట్ కు కేసీఆర్ హాజరు కావడంతో అమెరికా టూర్ (KCR America tour) అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే పైకి కేసీఆర్ తన మనవడి కాలేజీ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్తున్నారనే ప్రచారం ఉన్నా ఈ టూర్ వెనుక రహస్య ఎజెండా ఉందనే అభిప్రాయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.